ఉత్తర్‌ప్రదేశ్‌లో మొబైల్ ఫోన్లు నిషేధం
ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తనదైన శైలిలో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధిస్తూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఇకపై విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో సెల్‌ఫోన్లు వాడకూడదు. కేవలం విద్యార్థులకు మాత్రమే కాదని వారితో పాటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లోని బోధనా సిబ్బందికి కూడా ఈ నిషేధం వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని వారికి మెరుగైన బోధనా వాతావరణం కల్పించాలనే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత విద్యామండలి ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ అధికారిక సమావేశాలు, మంత్రివర్గ సమావేశాల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని ఇప్పటికే ఆధిత్యనాథ్ నిషేధించాడు…