లౌకికవాదానికి ఎప్పుడు కట్టుబడి ఉంటామని ఎంపీ కేసినేని నాని…


లౌకికవాదానికి ఎప్పుడు కట్టుబడి ఉంటామని ప్రజాస్వామ్య విలువలు కచ్చితంగా పాటిస్తానని కూడా విజయవాడ ఎంపీ కేసినేని నాని* స్పష్టం చేశారు ఆదివారం నాడు ఏలూరు రోడ్ లోని కే హోటల్ లో జరుగుతున్న 20 వ ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భారత దేశం లో ని 27 రాష్టల 175 మంది ముస్లిం మత ప్రతినిధులు హాజరు అయినా సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల హక్కులను కాపాడటమే ప్రజా ప్రతినిధి లక్ష్యమని ఆ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఎన్నోసార్లు పార్లమెంట్లో ప్రభుత్వాలను నిలదీయడం జరిగిందన్నారు తన కుటుంబానికి ముస్లింలతో స్నేహ పూర్వక సంబంధాలు మూడు తరాలకు వస్తున్నాయని వాటిని కొనసాగిస్తామన్నారు మతాల పేరుతో మరణ హోమం సృష్టించాలని అనుకునేవారు వారి ఆటలు సాగవు అన్నారు తనపై విజయవాడ పార్లమెంట్ ఎన్నికలలో ముస్లింలు అత్యధికంగా ఓటు వేసి గెలిపించడం జరిగిందని వారు తమపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్లమెంట్లో ముస్లిం సమస్యల పైన పోరాటం చేస్తామన్నారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మత పెద్దలు ఈరోజు ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం పై సంతోషం వ్యక్తపరిచారు ఈ సందర్భంగా కార్యక్రమ మీడియా ఇంచార్జ్ ఫారూఖ్ షూబ్లీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లౌకికవాదానికి కట్టుబడిన వారిలో ఎంపీ కేసినేని నాని ముందువరుసలో ఉంటారని ఎన్నోసార్లు ముస్లిం సమాజానికి సమస్యలు వచ్చినప్పుడు సామరస్యంగా పరిష్కరించి వివాదరహితుడిగా పేరొందిన ఎంపీ నాని ఈ కార్యక్రమానికి రావటం సంతోష్ దాయకం అన్నారు ఈ కార్యక్రమంలో ఆలిండియా మిల్లి కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు మౌలానా అబ్దుల్ ముగ ఇస్ మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్దుల్ మంజూరు ఆలం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష కార్యదర్శులు సులేమాన్ నద్వి అబ్దుల్ ఖదీర్ ల తో పాటు టిడిపి మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఫాత ఉల్లా పాల్గొన్నారు ఆల్ ఇండియా మిల్లి కౌన్సిల్ యొక్క ఉద్దేశాలు ఈ సందర్భంగా దేశంలో ఎదుర్కొంటున్న ముస్లిం సమస్యలు కాశ్మీర్ అంశం ముక దాడులు గురించి ముస్లిం మత పెద్దలు ఎంపీ కేశినేని నానితో చర్చించారు.

About The Author