గవర్నర్ జోక్యంతో క్యాబ్ డ్రైవర్ ల సమ్మె విరమణ.


తెలంగాణ గవర్నర్ తమిళిసై జోక్యంతో క్యాబ్ డ్రైవర్లు సమ్మె విరమించారు. మస్యలు పరిష్కరించాలని రెండున్నర నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా స్పందించడం లేదని నిరసిస్తూ ఈనెల 19వ తేదీ నుంచి సమ్మెకు క్యాబ్‌, ట్యాక్సీ డ్రైవర్స్‌ సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చింది. ఇప్పటికే ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్న పరిస్థితుల్లో క్యాబ్ డ్రైవర్లు సైతం సమ్మెలో ఉంటే ఎదురయ్యే ఇబ్బందులను అంచనా వేసారు. చెన్నై నుండి రాగానే గవర్నర్‌ తమిళిసై రంగంలోకి దిగారు.
చర్చలు జరిపి, ట్యాక్సీ, క్యాబ్‌ డ్రైవర్లు సమ్మె విరమించేలా చేశారు. వారి సమస్యల పరిష్కార దిశగా తన వంతు బాధ్యత తీసుకుంటానంటూ హామీ ఇచ్చారు. సమ్మె విరమించమని కోరారు. దీంతో..ఆ వెంటనే తాము సమ్మె విరమిస్తున్నట్లుగా క్యాబ్ డ్రైవర్ల జేఏసీ ప్రకటించింది. ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సిన పని నేరుగా గవర్నర్ జోక్యంతో సమ్మె విరమించటం పైన అసక్తి కర చర్చ మొదలైంది.

*జేఏసీతో నేరుగా చర్చలు*

జరిపిన గవర్నర్‌
తెలంగాణ ఆర్టీసీ సమ్మె గురించి నేరుగా మంత్రితో చర్చించిన గవర్నర్ తమిళిసై ఇప్పుడు మరో సమ్మె దిశగా జోక్యం చేసుకున్నారు. చెన్నై నుండి వచ్చిన గవర్నర్ చేరుకున్నా

About The Author