వర్షం తో పంట నష్టం. దిగులు పడుతున్న రైతన్నలు

తూర్పు గోదావరి జిల్లా మండపేట : వారం రోజులుగా ఎడతెరిపిలేని వానలు రైతన్నకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మండపేట మండలం లో సుమారు 18 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేస్తున్నారు. ఈ సారి చీడ పీడల బెడద పెద్దగా లేకపోవడంతో పంట పండిందని గతంలో చేసిన అప్పులు తిరుద్దామని రైతులు భావిస్తున్న తరుణంలో ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. మరో పది రోజుల్లో దీపాల అమావాస్య వెళ్లిన అనంతరం కోతలకు సిద్ధ పడుతుండగా ఈ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. పనలు ఒరిగి గింజలు రాలి పోతున్నాయి. దీంతో రైతు కళ్ళల్లో కన్నీరు ఆగడం లేదు.వర్షాలకు నేలకొరిగిన వరి పంట. తీవ్రంగా నష్టపోయిన రైతులు.చేతికి అందవలిసిన పంట నేలకొరగడం తో తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలకు కొన్ని వేల హెక్టారులలో వరి పంటకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం సర్వె చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం ముందుగా స్పందించి నష్టాన్ని అంచనా వేయాలని తద్వారా రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

About The Author