తుడా సెక్రటరీ.. రామ్ సుందర్ రెడ్డికి ఐఏఎస్ గా పదోన్నతి
తిరుపతి:తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ సెక్రటరీ ఎస్. రామ్ సుందర్ రెడ్డి గారు కన్ఫర్డ్ ఐఏఎస్ గా పదోన్నతి లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గురువారం
గెజిట్ విడుదల చేసింది. కడప జిల్లా చాపాడు మండలం, నక్కల దిన్నె గ్రామంలో వ్యవసాయ నేపధ్యం కలిగిన కుటుంబం రామ్ సుందర్ రెడ్డి గారిది. ఎంబీఏ విద్యను పూర్తి చేసిన ఆయన 2007 లో గ్రూప్-1 పరీక్షలు రాయగా అర్హత సాధించి మున్సిపల్ శాఖలో తిరుపతి అసిస్టెంట్ కమిషనర్ గా విధులు నిర్వహించారు. దీంతో సంతృప్తి చెందని ఆయన తిరిగి గ్రూప్-1 పరీక్షకు 2009 లో హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్ తో విజయం సాధించారు. ఆర్డీవో గా తొలి పోస్టింగ్ కర్నూల్ జిల్లా ఆధోని లో విధులు నిర్వహించారు. ఆ తరువాత నంద్యాల ఆర్డీఓ గా తనదైన శైలిలో ప్రజలతో మమేకమై విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) సెక్రటరీ గా విధులు నిర్వహిస్తున్నారు. Gropu-1 క్యాడర్ అధికారుల సీనియారిటీ ఆధారంగా, రాష్ట్రంలోని ఖాళీల ఆధారంగా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ లో రామ్ సుందర్ రెడ్డి కి ఐఏఎస్ గా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా తుడా ఛైర్మెన్