మహిళను బెదిరించి దోపిడీ చేసిన దొంగా అరెస్ట్

సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పట్టుకున్న సీసీఎస్ పోలీసులు

19న ఒంటరిగా ఉన్న తోకల మల్లమ్మ అనే వృద్ధురాలును బెదిరించి 2 తులాల బంగారు గోలుసు ఎత్తుకెళ్లిన రామగుండం ఎ కాలనీకి చెందిన సిరిమశేట్టి రవిని శనివారం రోజున అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డిసిపి రక్షిత కె మూర్తి వెల్లడించారు.ఈ సందర్బంగా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి మాట్లాడుతూ ఈ నెల 19న ఒంటరిగా ఉన్న మహిళ  తోకల మల్లమ్మ భర్త మల్లయ్య నివాసం హజీపూర్ హజీపూర్ వెళ్ళడానికి ఒంటరిగా ఉన్న మల్లమ్మను గమనించిన రవి ఆమెను వెంకటేశ్వర టాకీస్ దగ్గర ఆటోలో ఎక్కించుకొని పాత మంచిర్యాల లోని నిర్మానుష్యప్రాంతంలో తీసుకెళ్లి మల్లమ్మను బెదిరించి ఆమె మెడలోనుంచి 2 తులాల బంగారం లాక్కొని పారిపోయాడు అన్నారు.ఈ మేరకు రంగంలో దిగిన సీసీఎస్ పోలీసులు సీసీ కెమెరా ఆదరంగా దొంగ ఉపయోగించిన ఆటో నంబర్ గుర్తించి.ఈ రోజు ఉదయం పట్టణ సిఐ లింగయ్య, సీసీఎస్ సిఐ రమణ బాబు తమ సిబ్బందితో బెల్లంపల్లి చౌరస్తాలో వాహనాల తనిఖీలు చేస్తుండగా దోపిడీ చేసిన బంగారాన్ని అమ్మడానికి వస్తున్న రవిని అనుమానాస్పదంగా కనబడడంతో పట్టుకొని విచారించగ  తాను 19న చేసిన నేరాన్ని ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి చోరీ చేసిన 65 వేల రూపాయలు విలువ చేసే బంగారు గోలుసును,ఒక ఆటో రిక్షాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సిరిమశెట్టి రవి గతంలో  రామగుండలో సమ్ము అనే వ్యక్తిని చంపి  ఆనంద్ అనే వ్యక్తి పై హత్యాయత్నం చెయ్యగా పోలీసులు అతనికి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా  అట్టి కేసులో అతనికి 10 సంవత్సరాల కారాగార శిక్ష కోర్టు విధించింది అని తెలిపారు

ఈ  కార్యక్రమంలో  ఎసిపి గౌస్ బాబా,సిఐ ముత్తి లింగయ్య,ఎస్ఐ లు మారుతి, ఓంకార్ పాల్గొన్నారు.

About The Author