శ్రీ వేంకటేశ సుప్రభాత స్తోత్రము… చరిత్ర

https://www.facebook.com/2249905521816331/posts/2829460197194191/
శ్రీ వేంకటేశ సుప్రభాతమును, స్తోత్రమును, ప్రపత్తిని, మంగళా శాసనములను ప్రతివాది భయంకర అణ్ణన్ స్వామి (1361-1454) రచించినాడు. వీరికి వాదిభీకర మహాగురువు అను నామాంతరము గలదు. ఇతడు శ్రీవైష్ణవాచార్యుడైన (కృష్ణమాచార్యులు) మనవాళ మాముని (క్రీ.శ. 1370-1443) శిష్యుడు. మనవాళమాముని తిరుమల వేంకటేశ ఆలయమును దర్శించినపుడు గుర్వాజ్జ్ఞను అనుసరించి అణ్ణన్ స్వామి
సంస్కృత భాషలో ఆశువుగ శ్రివెంకటేశ సుప్రభాతం, వేంకటేశ స్తొత్రము ప్రపత్తి, మంగళా శాసనములను రచించాడు. నాటినుండి నేటికీ తిరుమల శ్రీవేంకటేశ్వరాలయంలో ప్రతివాది భయంకర అణ్ణన్ స్వామి రచించిన సంస్కృత సుప్రభాతము మొదలగునవి పఠింపబడుచున్నవి. ఈ సుప్రభాత
రచనకు ముందు తిరుమల శ్రీవారిసన్నిధిలో విప్రనారాయణుడు (తొండరడిప్పడి ఆళ్వార్ )రచించిన శ్రీ రంగనాథుని ప్రాబోధకీ స్తుతి (తిరుప్పళ్ళి యెళుచ్చి ) పదిపాశురములు పఠింపబడుచుండేవి.

ఇవి తమిళ భాషలోసుప్రభాతమనగా మెలుకొలుపు అనునది సామాన్యార్ధము. ప్రభాతమనగా తెల్లవారుటకు ముందు నాలుగు గడియలు గల కాలము, వేకువ అని నిఘంటువు చెప్పుచున్నది. ప్రకృతిలో అంతవరకు గల చికటీిని తొలగించు సూర్యుని వెలుగు ప్రారంభమగుకాలము సుప్రభాతము. భక్తుని
హృదయములో ఆవరించియున్న అజ్ఞానాంధకారము భగవంతుని అనుగ్రహము అను జ్ఞానజ్యోతిచే తొలగిపోవు కాలమును సుప్రభాతమన వచ్చును. “శోభనం చ తత్‌ ప్రభాతం చ సుప్రభాతమ్‌” అను వ్యుత్పత్తిచే సుందరమైన ప్రభాత (వేకువ) సమయము సుప్రభాతమని తాత్పర్యము.

సాధారణముగా నుప్రభాత స్తోత్రములలో భగవంతుని “తవ
సుప్రభాతమ్‌” అని స్తుతించుట గలదు. ఇక్కడ శుభోదయము అను సొమాన్యార్ధము గాక భగవంతుని యెడ ఆసక్తి గలిగిన భక్తుడు, న్వామిని సమీపించి మేలుకొలుపు సమయము శుభోదయము పలుకు సమయము సుప్రభాతమను విశేషార్ధము గలదు. తనయందు ఆసక్తి గలిగిన భక్తుడు తనను చేరి కిర్తించు సమయము భగవంతునికి సుప్రభాతమగుచున్నది.
భగవంతుడు ఆశ్రితాభిలాషి.

భగవంతుని సేవించి, తరించ దలంచిన భక్తుడు ఆశ్రయించు సేవలలో సుప్రభాతము ప్రథమ గణ్యమైనది. సుప్రభాత స్తోత్రమును పరిశీలించినపుడు కింద పేర్కొనిన లక్షణములు కనబడుచున్నవి.

1. ప్రభాత కాలమున ప్రకృతిలో కనిపించు సుందర దృశ్యములను వర్ణించుట.

2. మేల్కాంచిన భగవంతునికి తత్కాలమున చేయదగు కార్యములను జ్ఞాపకము చెయుట.

3. భగవంతునియందు గల షడ్డుణములను ప్రశంసించుచు భక్తరక్షణకు సిద్దమగునట్లు వెడుకొనుట.

4. అనన్య భక్తితో నీవే తప్ప నాకు వేరు దిక్కు లేదని భగవంతుని
ఆశ్రయించి, ప్రపత్తి చేయుట.

5. వాత్సల్య భక్తితో సర్వదా శ్రీవారి వైభవము అభివృద్ది చెందవలెనని మంగళమును ఆశంసించుట ఉన్నవి.

ఇప్పుడు శ్రీవారి ఆలయములో ఒక్క ధనుర్మాసమున మాత్రము శ్రీరంగనాథుని ప్రాబోధకీస్తుతి (తిరుప్పళ్ళి యెళుచ్చి) సంపూర్తిగా, పిమ్మటగోదాదేవి (ఆండాళ్‌) రచించిన తిరుప్పావైలో రోజూ ఒక్క పాశురము చదువబడుటతో శ్రీవేంకటేశ్వరస్వామివారి సుప్రభాతసేవ జరుగుచున్నది.

ఈనాడు ప్రచారములో ఉన్న వివిధ దేవతా సుప్రభాతములు శ్రీ వేంకటేశ సుప్రభాతమునకు అనుకరణములుగా నున్నవనుటలో సందేహము లేదు.

శ్రీవారి సుప్రభాతమును రచించిన ‘ప్రతివాది భయంకర అణ్ణన్ స్వామి’ వారి సన్నిధి గోవిందరాజ స్వామి ఆలయ దక్షిణ మాడ వీధిలో ఉన్నది. తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పక దర్శించండి.

About The Author