కాపురంలో చిచ్చు పెట్టిన టిక్‌టాక్
టిక్‌టాక్ పరిచయం పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది. భార్య ఉండగానే టిక్‌టాక్‌లో మరో మహిళతో భర్త పరిచయం పెంచుకున్నాడు.
అంతటితో ఆగక.. వారి పరిచయం పెళ్లి దాకా వెళ్లింది. పరిచయమైన మహిళను భార్యకు తెలియకుండా తిరుపతికి తీసుకెళ్లి ఆ భర్త పెళ్లిచేసుకున్నాడు. విజయవాడకు చెందిన వీటీపీఎస్ ఉద్యోగి సత్యరాజు చేసిన నిర్వాకమిది. పెళ్లి విషయం ఇంట్లో తెలియడంతో భార్యను హత్య చేసేందుకు సత్యరాజు ప్లాన్ చేశాడు. అయితే.. అదృష్టవశాత్తూ ఆ భార్య భర్త పన్నాగాన్ని పసిగట్టి.. అతని నుంచి తప్పించుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసు్ స్టేషన్ లో పిర్యాదు చేయడానికొచ్చిన,మొదటి బార్య