సూపర్‌ సైక్లోన్‌ గా మారిన క్యారా తుఫాను

అరేబియా సముద్రంలో ఏర్పడిన క్యారా తుఫాను సూపర్ సైక్లోన్‌ గా మారిందని హెచ్చరించింది ఐఎండీ. ముంబై తీరానికి 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న క్యార్రా తుపాన్ ఒమన్ దేశంలోని సలాలాహ్, మసీరహ్ నగరాల వైపు పయనిస్తోందని వెల్లడించింది. ఈ సైక్లోన్‌ ప్రభావంతో రాగల 24 గంటల్లో మరాఠ్వాడ, విదర్భ, ఛత్తీస్‌ఘడ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఎల్లుండి వరకు లక్షద్వీప్, శ్రీలంక ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుందని తెలిపారు.

 

About The Author