రిలీజ్ చేసిన దిల్ రాజు ‘తుపాకి రాముడు’ ఏమయ్యాడు?

హాస్య నటులు ..హీరోలుగా మారి సినిమా చేయటం..డిజాస్టర్ అవటం అనేది సామాన్య విషయం గా మారింది. ఎంతో కథా బలం ఉంటే తప్ప ..కమిడియన్స్ ని హీరోలుగా సినిమా చివరి వరకూ చాలా వరకు కష్టం తేల్చేస్తున్నారు. ఇప్పటికే అలీ, బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్, సప్తగిరి, వేణు మాధవ్, షకలక శంకర్, శ్రీనివాస రెడ్డి వంటి సినిమాల్లో పేరు తెచ్చుకున్న కమిడియన్స్ …హీరోలుగా సక్సెస్ సాధించలేకపోయారు. ఒకటీ అరా వర్కవుట్ అయ్యినా ఆ క్రెడిట్ డైరక్టర్ ఖాతాలోకి పోయింది. ఈ నేపధ్యంలో బిత్తిరి సత్తి సైతం హీరోగా అవతారమెత్తాడు.

ప్రత్యేకరాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ నేపథ్య ఇతివృత్తాలతో వరసగా సినిమాలు వస్తున్నాయి.

ముఖ్యంగా తెలంగాణ ప్రాంత సంస్కృతులు, సంప్రదాయాలకు కమర్షియల్ హంగులను జోడించి సినిమాల్ని రూపొందిస్తూ దర్శక,నిర్మాతలు చక్కటి విజయాల్ని అందుకుంటున్నారు. ఆ వరసలో వచ్చిన చిత్రమే తుపాకిరాముడు. టీవీ ఛానెల్ లో యాంకర్ గా చక్కటి గుర్తింపును సొంతం చేసుకున్న బిత్తిరి సత్తి అలియాస్ చేవేళ్ల రవికుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ శాసనసభ్యుడు, నిర్మాత రసమయి బాలకిషన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సామాజిక చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న టి. ప్రభాకర్ డైరక్షన్ లో రూపొందిన సినిమా ఇది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను విడుదల చేయడం, ట్రైలర్స్ తో తుపాకిరాముడు తెలుగు ప్రేక్షకుల్లో కొంతవరకూ,కొన్ని వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించిన మాట నిజం. అయితే ఆ క్రేజ్ ని తుపాకి రాముడు ఎంతవరకూ క్యాష్ చేసుకోగలిగాడు అంటే శూన్యమే అని చెప్పాలి.

తుపాకి రాముడి’గా బిత్తిరి సత్తి తనదైన శైలిలో మెప్పించాడు. సందర్భాన్ని బట్టి కామెడీని .. ఎమోషన్ ను పండించాడు. అనిత పాత్రలో కథానాయిక ‘ప్రియ’ కూడా బాగానే చేసింది. ‘రసమయి బాలకిషన్’ పై ఒక పాటను చిత్రీకరించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. తెలంగాణా ప్రాంతాల్లో కూడా స్పందన అంతంత మాత్రం.

ఈ సినిమా సరైన ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది. సత్తి కెరీర్ కు ప్లస్ కాలేకపోయింది. నేనూ హీరోగా చేసాను అని చెప్పుకోవటానికి మాత్రమే ఉపయోగాలా తయారైంది. సరైన కథ కానీ, కాస్టింగ్ కానీ, మార్కిటింగ్ కానీ లేకపోవటంతో ఈ సినిమా రిలీజైందనే విషయం చాలా మందికి తెలియలేదు. రిలీజ్ అయ్యాక మీడియా సైతం ప్రయారిటీ ఇవ్వలేదు. దాంతో తుపాకి రాముడు…సినిమా ప్రయత్నం నిరాశాజనకంగా ముగిసింది.

 

About The Author