తిరుమల \|/ సమాచారం ఓం నమో వేంకటేశాయ!!
ఈ రోజు బుదవారం,30.10.2019 ఉదయం 6 గంటల సమయానికి,
నిన్న 78,885 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శన భాగ్యం కల్గినది,
స్వామివారి సర్వదర్శనం కోసం తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 18గదిలో భక్తులు వేచి ఉన్నారు,
ఈ సమయం శ్రీవారిసర్వదర్శనాని కి సుమారు 12 గంటలు పట్టవచ్చును,
నిన్న 25,652 మంది భక్తులు స్వామి వారికి తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు
నిన్న స్వామివారికి హుండీలో భక్తులుసమర్పించిన నగదు₹: 3.77 కోట్లు, శీఘ్రసర్వదర్శనం(SSD), ప్రత్యేక దర్శనం (ఆన్ లైన్ ₹:300/-), దివ్యదర్శనం (కాలినడక) వారికి శ్రీవారి దర్శనానికి సుమారుగా రెండు గంటల సమయం పట్టవచ్చును,
*గమనిక:*
:10,000/- విరాళంఇచ్చు శ్రీవారి భక్తునికిశ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒకవిఐపి బ్రేక్ దర్శన భాగ్యంకల్పించిన టిటిడి,
ఈరోజు చంటిపిల్లలతల్లిదండ్రులకు శ్రీవారిప్రత్యేక ప్రవేశ దర్శనం(ఉ: 9 నుండి మ:1.30వరకు సుపథం మార్గంద్వారా దర్శనానికిఅనుమతిస్తారు,భక్తులు రద్దీ సమయాల్లోఇబ్బంది పడకుండా ఈఅవకాశం సద్వినియోగంచేసుకోగలరు)
వయోవృద్దులు / దివ్యాంగుల
ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు.
ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,
చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారై ప్రత్యేక దర్శనాలు
సుపథం మార్గం గుండా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల వరకు దర్శనానికిఅనుమతిస్తారు,
శ్రీవేంకటేశ్వర సుప్రభాతం
!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ !!
తా:_కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి