నాగబాబు బర్త్‌డే.. అభిమానులకు మెగా గిఫ్ట్‌


హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి సోదరుడు నాగాబాబు పుట్టినరోజు మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి, ఆయన సతీమణి సురేఖతోపాటు రామ్‌చరణ్‌, ఉపాసన, సుస్మిత, శ్రీజ, కల్యాణ్‌దేవ్‌, అల్లు అర్జున్‌ దంపతులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మెగాఫ్యామిలీలో ముఖ్యులు ఒకే వేదికపై సందడి చేసిన ఫొటోలకు అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు.

బుల్లితెరలో ప్రసారమయ్యే ఓ కామెడిషోలో నాగబాబు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు చిరంజీవి.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తన 152వ సినిమాని చేయనున్నారు. మరోవైపు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంటున్నారు రామ్‌చరణ్‌. ఇంకా అల్లుఅర్జున్‌ సైతం త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో నటిస్తున్నారు. బన్నీ కథానాయకుడిగా బుధవారం మరో కొత్త సినిమా ప్రారంభమైంది.

About The Author