తిరుమల \!/సమాచారం ఓం నమో వేంకటేశాయ

ఈరోజు గురువారం 31-10-2019 ఉదయం 5 గంటల  సమయానికి.తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనానికి 15 కంపార్ట్ మెంటులో వేచి ఉన్న భక్తులు.శ్రీవారి  సర్వ దర్శనానికి 16 గంటల సమయం పడుతోంది.

కాలినడక, టైమ్ స్లాట్ సర్వ దర్శనాలకు 4 గంటల సమయం పడుతోంది.నిన్న  అక్టోబర్ 30 న 72,554 మంది భక్తులకు శ్రీవారి ధర్శనభాగ్యం కలిగినది…‌నిన్న స్వామి వారికి హుండీలో భక్తులు సమర్పించిన నగదు కానుకలు ₹ 2.85  కోట్లు.

ఈనెల 30 న చంటిపిల్లలతల్లిదండ్రులకు శ్రీవారిప్రత్యేక ప్రవేశ దర్శనం(ఉ: 9 నుండి మ:1.30వ‌ర‌కు సుపథం మార్గంద్వారా దర్శనానికిఅనుమతిస్తారు,

వయోవృద్దులు / దివ్యాంగుల

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ వద్ద వృద్దులు (65 సం!!) మరియు దివ్యాంగులకు ప్రతిరోజు 1400 టోకెన్లు జారీ చేస్తున్నారు. 

ఉ: 7 గంటలకి చేరుకోవాలి,ఉ: 10 కి మరియు మ: 2 గంటలకి దర్శనానికి అనుమతిస్తారు,

చంటి పిల్లల తల్లిదండ్రులు / ఎన్నారైప్రత్యేకదర్శనాలు

సుపథం మార్గం గుండా  శ్రీవారి దర్శనానికిఅనుమతిస్తారు, ఉ:11 నుండి సా: 5 గంటల  వరకు దర్శనానికి అనుమతిస్తారు,

శ్రీవేంకటేశ్వర సుప్రభాతం

!!కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్‌ !!

తా: _కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా!తూర్పు తెల్లవారుచున్నది.దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది కావున లెమ్ము స్వామి

 

About The Author