IPS ల నెత్తిపై వుండే సింహాలు సైతం సిగ్గు పడేలా చేసిన యువ ఐపిఎస్.
కులం అనే మత్తు కులం అనే రోగం మెదడుకెక్కితే ఎంతటి వాడైన ఆదిమానవుడి కన్నా క్రూరంగా తయారు అవుతాడు అనడానికి నిదర్శనమే ఈ కథ…
అతనో ట్రైనీ ఐపీఎస్..అతని పేరు కొక్కంటి వెంకట మహేశ్వర రెడ్డి…ఒక అమ్మాయిని ప్రేమించాడు…వెంటబడ్డాడు..
స్నేహం అన్నాడు…
నిన్ను ప్రేమిస్తున్న అన్నాడు.
జీవితాంతం నీ తోడుగా ఉంటానన్నాడు..
ఎప్పటికి తోడుగా ఉంటానన్నాడు..
తను లేనిదే బతకనని నమ్మించాడు..
పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేసాడు..
తన తల్లిదండ్రులను ఒప్పిస్తా అని చెప్పాడు..
తన జీవిత ధ్యేయం సివిల్స్ సాధించడం అని చెప్పాడు.
అన్ని అన్నట్టుగానే జరిగాయి…
పెళ్లి చేసుకున్నాడు..
సివిల్స్ కోసం తనకు సపోర్ట్ గా ఉండాలని ఆ అమ్మాయిని కోరాడు..
ఆ అమ్మాయి తన సర్వం వదిలి తన కెరియర్ ను సైతం లెక్క చేయకుండా అనుక్షణం అతనికి బాసటగా నిలిచింది.. తన జీవితంలో తన కెరియర్ ను వదిలి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంది ఆ అమ్మాయి..
చివరకు అతను ఐపీఎస్ సాధించాడు…
“ఐపీఎస్” సాధించిన వెంటనే ఆ అమ్మాయి త్యాగాలు అతనికి గుర్తుకి రాలేదు…ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందా అని గుర్తుకు రాలేదు…కేవలం ఆ అమ్మాయి “కులం” అడ్డుచ్చింది ఒక ఐపీఎస్ చదివిన అపార మేధావి అయినటువంటి కొక్కంటి వెంకట మహేశ్వర రెడ్డి సార్ గారికి…
కేవలం అమ్మాయి దళిత కులానికి చెందినది కావడం తో ఐపీఎస్ సాధించగానే సార్ కి జ్ఞానోదయం అయిందేమో..సడెన్ గా మా తల్లిదండ్రులు ఒప్పుకోరు.నీ కులం వేరు నా కులం వేరు..నువ్వు నన్ను వేదిలేయ్ అని చెప్పాడు..
ఆ అమ్మాయిని ఎంతో క్షోభకు గురి చేసాడు..ఆ అమ్మాయిని విడిపించుకోవడం కోసం తన తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేసారని అబద్ధం చెప్పాడు…తనని తన వెంట తీసుకవేళ్లలేనని అసలు నీకు పెళ్లి చేసుకోడమే పెద్ద తప్పుచేశానని విడాకులు ఇవ్వమని ఇబ్బందులకు గురి చేసాడు..అను నిత్యం టార్చర్ చేశాడు.. ఆమెని మానసికంగా శారీరకంగా హింసించాడు..బెదిరింపులకు పాల్పడ్డాడు..
అమ్మాయిని నువ్వు ఈ విషయం బయట తెలిసేలా చేసిన బాగోదాని తనను తన కుటుంబాన్ని జాడ లేకుండా చంపేస్తానని బెదిరించాడు..ఇప్పుడు తాను సాధారణ మనిషిని కానని ఒక ఐపీఎస్ ఆఫీసర్ నని తనను ఎవరూ ఎం చేయలేరు తనకు ఆంధ్రలో పెద్ద పెద్ద మినిష్టర్ లు ఎమ్యెల్యే లు అందరూ చుట్టాలు నువ్వు ఎం చేయలేవు ఏదన్నా చేయాలని ప్రయత్నం చేసావో నిన్ను నీ కుటుంబాన్ని అంతం చేస్తా నీకు ఏ రాజకీయ నాయకుడు కానీ పోలీస్ అధికారి కానీ సహాయం చేయడు చేయలేడు అని నిత్యం బెదిరింపులకు గురిచేస్తున్న దీ గ్రేట్ ఐపీఎస్ ఆఫీసర్ కొక్కంటి వెంకట మహేశ్వర రెడ్డి…
ఆ అమ్మాయి హైదరాబాద్ లో పోలిస్ అధికారులను కలిసింది అని తన గుండాలను పంపి ఆ అమ్మాయి తల్లిదండ్రులను బెదిరించాడు..
ఒక వేళ అమ్మాయి ఈ దేశ ప్రధాన మంత్రి కుతురైన దళిత కులం వాళ్ళు ఉంటే తాము ఒప్పుకోమని చులకనగా మాట్లాడాడు..
ఇంత కుల పిచ్చి ఉన్న వీడు ఓక మనీషేనా??ఐపీఎస్ లాంటి ఉన్నత చదువు చదివి ఈ సమాజానికి ఎం మేలు చేస్తాడు???
ఆ అమ్మాయికి సపోర్ట్ లేకపోవడంతో 6 నెలలుగా పోరాటం చేస్తుంది.సర్వం కోల్పోయిన తాను ఆత్మహత్యే శరణ్యం అనుకోండి..మిత్రులారా ఇంతటి కుల పిచ్చి ఉన్నవాడు ఈ సమాజానికి చాలా ప్రమాదకరం..వీడికి తగిన శిక్ష పడాలి..ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ కేసు నమోదు చేస్తామన్నారు…ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ విషయం పై దర్యాప్తు జరపాలి..అతనిపై చర్యలు తీసుకోవాలి.. రాజకీయ నాయకులు జోక్యం మానుకొని ఆ అమ్మాయి స్థానం లో తమ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎలా ఎం జరిగేదో ఆలోచించండి.