ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎక్కడ, ఎందుకు, ఎలా పెట్టాలి?
వాస్తు శస్త్రం, శిల్పకళ విజ్ఞాన శాస్త్రములో ఒక భాగం. ఇది మన గృహాలలో అనుకూల శక్తి ప్రసరించే విధంగా ఇళ్ళు ఎలా నిర్మించాలో తెలియజేస్తుంది. ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఒక నిర్దిష్ట శక్తి(ఆరా) కలిగి ఉంటుందని వాస్తు శస్త్రం చెబుతోంది. ఆరా ఇక్కడ ఒక వస్తువు చుట్టూ సృష్టించబడిన వాతావరణంను సూచిస్తుంది. ఈ వాతావరణం సానుకూల లేదా ప్రతికూలమైన కొన్ని తరంగాలను కలిగి ఉన్న శక్తుల నుండి రూపొందించబడింది. తద్వారా ఇది పరిసరాలను ప్రభావితం చేస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక భవనం విషయంలో, ప్రసరణ జరిగే శక్తి భవనం యొక్క నిర్మాణం మరియు నిర్మాణ ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, తూర్పు దిశలో సూర్యోదయం జరుగుతుంది. ఇది అనుకూల ప్రకంపనలు కలిగిన శక్తితో సంబంధం కలిగి ఉంటుంది కనుక తలుపులను తూర్పు వైపుగా తెరిచి ఉండాలి.
వాస్తు శాస్త్ర ప్రకారం గృహ నిర్మాణం జరగనప్పుడు:
కొన్ని సందర్భాల్లో, భవనం యొక్క నిర్మాణం వాస్తు శాస్త్ర సూచనల ప్రకారం జరగనపుడు, ప్రతికూల శక్తుల సంచారం ఈ ఇంట్లో అధికామయ్యి, ఇంటి సభ్యుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. అటువంటి పరిస్థితికి పరిష్కారంగా, వాస్తు శాస్త్రం కొన్ని అంశాలను సూచిస్తుంది. వాటిని ఇంట్లో ఉంచుకోవడం వలన, ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. ఇటువంటి అంశాలలో ఒకటి లాఫింగ్ బుద్ధ.
అసలు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఎందుకు ఉంచాలి?:
లాఫింగ్ బుద్ధ, ఇంట్లో ఉంచినప్పుడు, ధన ప్రవాహం పెరిగి, కుటుంబ సభ్యులు అందరికీ మంచి అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. కొన్నిసార్లు ఇంట్లో లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఉంచే విషయంలో పాటించవలసిన నియమాలకు సంబంధించిన అవగాహన లేకపోవడం వలన, ప్రజలు తప్పులను చేస్తారు. దీనివలన అనుకూల శక్తి మరియు ప్రతికూల శక్తుల మధ్యలో సమన్వయం సాధించడానికి వారు పడే ప్రయాస వృథా అవుతుంది. కనుక మీ కొరకు మేము, ఈ వ్యాసం ద్వారా లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టేటప్పుడు, మీరు నియంత్రించాలనుకుంటున్న విషయాల ఆధారంగా, మనసులో ఉంచుకోవలసిన అంశాలను తెలియజేస్తున్నాం.
శాంతి మరియు సౌభ్రాతృత్వాల కోసం:
ఇంట్లో ప్రశాంతత కరువై, కుటుంబ సభ్యుల మధ్య తరచూ కీచులాటలు మరియు వాదనలు జరుగుతున్నట్లైతే, మీ ఇంటి తూర్పు దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉండాలి. ఇది సభ్యుల మధ్య సామరస్యాన్ని మరియు మెరుగైన అవగాహనను కలిగిస్తుంది.
ఉద్యోగ అవకాశం కోసం:
లాఫింగ్ బుద్ధ విగ్రహం ఉంచే స్థానం మన ఉద్యోగ అవకాశాలను కూడా ప్రభావితం చేస్తుంది. కుటుంబానికి చెందిన ఏ వ్యక్తికి అయినా ఉద్యోగం సాధించడంలో కష్టాలు ఎదురవుతూ ఉంటే, మీరు ఇంటికి ఆగ్నేయ దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం పెట్టాలి. ఇలా చేస్తే, త్వరలోనే ఉద్యోగం పొందడానికి అవకాశం ఉంటుంది. దీనితోపాటు, ఆగ్నేయ దిశలో దీనిని ఉంచడం వలన, ఇంట్లో డబ్బులకు కొరత ఉండదు
ఉద్యోగ జీవితాన్ని మెరుగుపరచుకోడానికి:
మీ ఉద్యోగ జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లేదా మీ పనిని చెడు దృష్టితో ప్రభావితం అవుతుంది అని భావిస్తున్నట్లైతే, నడిచే దారిలో ప్రతిఒక్కరి దృష్టి సులభంగా పడే ప్రదేశంలో లాఫింగ్ బుద్ధ విగ్రహంని ఉంచితే, ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చెడు దృష్టి యొక్క ప్రభావాలు తొలగిస్తుంది మరియు వృత్తి జీవితం మెరుగుపరచి, తద్వారా పురోగతి తీసుకువస్తుంది.
ఇతర సమస్యలకు:
ఇల్లు మరియు కార్యాలయంలో కూడా సమస్యలను ఎదుర్కొంటున్నట్లైతే, రెండు చేతులు పైకి ఎత్తి ఉన్న విగ్రహాన్ని, ప్రత్యేకంగా తూర్పువైపుగా ఉంచడం వలన పరిస్థితి మెరుగుపడడానికి సహాయపడుతుంది. మీరు ఇలా చేస్తే, అన్ని సమస్యలు క్రమంగా మీ దారిని వీడి, పనులన్నీ గాడిలో పడతాయి.
బిడ్డలు కలగడానికి:
బిడ్డలు కలగాలంటే, పిల్లలతో కలిసి నవ్వుతూ ఉన్న లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని తప్పకుండా ఉంచాలి. ఈ విగ్రహాన్ని వంటగదిలో లేదా బాత్రూమ్ సమీపంలో ఉంచకూడదు. ఇలా చేస్తే, ఇంట్లో అసౌకర్యాలు ఎదురవుతాయి.