కేరళ సాంప్రదాయాలు ఆదర్శనీయం ..ఓణం ఫెస్ట్ -2019లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
కేరళ సాంప్రదాయాలు ఆదర్శనీయం
ఓణం ఫెస్ట్ -2019లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
దేశంలో సంస్కృతి, సాంప్రదాయాలు, ఆదర్శ జీవనానికి కేరళ ఆదర్శనీయం అని ప్రభుత్వ విప్, తుడా ఛైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి గందమనేని శివయ్య భవన్ లో కేరళ సమాజ్ ఆధ్వర్యంలో ఓణం ఫెస్ట్ -2019 ను వేడుకగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చెవిరెడ్డి గారు హాజరయ్యారు. అంతకుముందు కేరళ డప్పుల వాయిద్యాల నడుమ, కేరళా సాంప్రదాయాల తో చెవిరెడ్డి గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేరళ రాష్ట్రం చిన్నదైనా సాంప్రదాయాలను కొనసాగించడంలో దేశానికే ఆదర్శంగా నిలిలుస్తోందన్నారు. ఇందుకు ఏటా చక్కగా నిర్వహించుకునే ఓణం పండుగ నిదర్శనంగా నిలుస్తుందన్నారు. దశాబ్దాల కాలంగా తుమ్మల గుంట ఆలయ బ్రంహ్మోత్స వాలలో కేరళ డప్పుల వాయిద్య కళాకారులతో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు వివరించారు.