ఎస్సీ, ఎస్టీ ల భూసేకరణ పరిహారం త్వరగా చల్లించండి.
హరిజనవాడ, గిరిజనవాడ అని రహదారుల్లో ఉన్న సూచిక బోర్థులు 7 రోజుల్లో మార్చాలి.
– కారెం శివాజీ
తిరుపతి, నవంబర్ 05 : ఎస్సీ, ఎస్టీ ల వద్ద ప్రభుత్వ అవసారాలకు సేకరించిన భూముల పరిహారం త్వరగా చెల్లించే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ డా.నారాయణ్ భరత్ గుప్తాను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ ఛైర్మన్ కారెం శివాజీ కోరారు. మంగళవారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతీ అతిధి గృహంలో ఎస్సీ, ఎస్టీ కమీషన్ జిల్లా యంత్రాంగంతో సమావేశమై ఎస్సీ, ఎస్టీ కమీషన్ కోర్ట్ లో ఉన్న కేసులు సమీక్షించింది. ఈ సంధర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల భూమి ఎస్సీ, ఎస్టీ లకు ఉంటే 9 లక్షలు అన్యాక్రాంతకాగా రాష్ట్ర విడిపోయిన తర్వాత 2 లక్షలు తెలంగాణ 3 లక్షలు ఎకరాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని అన్నారు. చదువురాక, అవగాహన లేక సరైన సమయంలో వారు స్పందించక పోవడంతో జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ల భూములు భూసేకరణకు పరిహారం చెల్లింపులో ఆలస్యం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ మానవతా దృక్పథంతో పరిహారమా, ప్రత్యామ్నాయమా నిర్ణయించాలని అన్నారు. సూరప్పకశం, ఆవిలాల, వెదళ్లచెరువు, చుట్టుగుంట రామాపురం