మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర మీడియా సమావేశం…


ఈరోజు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షి బ్లీ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు అనుకూల మైనటువంటి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అవుతుందని, అదేవిధంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల పక్షపాతి అని భావించిన వారందరికీ అయోమయ పరిస్థితిలో పడేస్తున్నారు. దానికి కారణం ఈ మధ్యలో మైనారిటీ వ్యవహారాలపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు దీనికి కారణం ఇది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కనుక ఉండి ఉన్నట్లయితే ఇటువంటి పొర పాట్లు దొర్లే అవకాశం ఏ మాత్రం ఉండేది కావు కానీ అధికారులు మరియు మైనార్టీ మంత్రిత్వ శాఖ విషయాలపై అవగాహన లేకనో మైనారిటీ సమస్యలపై నిర్లక్ష్యపు ధోరణి అవలంబించడం ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి.
నవంబర్ 11 భారతరత్న మొట్ట మొదటి విద్యా శాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ గారి జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సమయంలో జీవో నెంబర్ 393 ద్వారా వివాదాస్పద విషయాలను పొందుపరుస్తూ జారీ చేయడం జరిగింది అందులో డాక్టర్ అబ్దుల్ హక్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపకులు మన ఆంధ్రరాష్ట్ర వాసి పేరుతో ఉన్న డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డుని తొలగించడం, గతంలో 2 లక్షల 50 వేల రూపాయలు ఉన్న మన అబ్దుల్ కలాం ఆజాద్ నేషనల్ అవార్డు పైకాన్ని లక్ష రూపాయలకు కుదించటం, బెస్ట్ ఉర్దూ టీచర్ అవార్డు గ్రహీతలకు ఇచ్చే పైకాన్ని పది వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయలకు కుదించడం, ప్రతి ఏటా 8 మందికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చేవారు కానీ వాటిని 8 నుండి నలుగురికి కుదించటం అత్యంత దారుణమైనటువంటి సంఘటన.
ఇది మాత్రమే కాకుండా నవంబర్ 11న మైనారిటీ డే మరియు ఎడ్యుకేషన్ డే అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు తెలిసి కూడా అదే రోజున పరీక్షలు నిర్వహించడం తర్వాత తప్పును తెలుసుకుని సరిదిద్దటం, అదే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాన్ని డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి గారి పేరుతో మార్చడాన్ని తీవ్రంగా ముఖ్యమంత్రే ఖండించి ఫలితంగా మరల ఏపీజే అబ్దుల్ కలం పేరుతోనే ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని అని ఆదేశాలు ఇవ్వడం హర్షణీయం. అదేవిధంగా మైనారిటీ మంత్రిత్వ శాఖ మరియు అధికారులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు? ఈ సమస్యలను సానుకూలంగా పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఫారూఖ్ షిబ్లీ డిమాండ్ చేశారు.

About The Author