మన భారతదేశానికి రెండో రాజధాని… అమరావతి..?


04112019 నాడు మహారాష్ట్ర మాజీ గవర్నరు – సీనియర్ భాజపానేత అయిన విద్యాసాగర్ రావు గారు – ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోయిన కారణంగా హైదరాబాదు దేశానికీ రెండవ రాజధాని అయ్యే అవకాశం ఉందని పాత స్టేట్మెంటునే మరోమారు తెరపైకి తెచ్చి చర్చనీయాంశంగా చేసారు …

పెద్దల ఆలోచన ప్రకారం – పొల్యూషన్ – భద్రత – పరిపాలనా సౌలభ్యాల దృష్ట్యా దేశానికి రెండవ రాజధాని అవసరమే అయినప్పటికీ …

దానికి ఆల్రెడీ *విపరీతమైన జనాభాతో* – *కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాదు లాంటి నగరాన్ని*
*ఎంచుకోవటం సరికాదనేది* నా అభిప్రాయం …

దానికన్నా – ఎలాగూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి నిర్మించే ఆలోచన లేదని పరోక్షంగా తేలిపోయింది కాబట్టి –

ఆల్రెడీ స్వచ్ఛందంగా రైతుల వద్ద నుండి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన ముప్పై వేల ఎకరాల భూమీ ఖాళీగా పడి ఉంది కాబట్టీ …

ఆ ప్రాంతాన్ని దేశానికి కొత్త రాజధానిగా ( రెండవ) జేస్తే బాగుంటుందనేది కూడా నా అభిప్రాయమే …

ఎందుకంటే :

*01. ప్లీ ప్లాన్డ్ సిటీగా నిర్మించేందుకు తగినంత అవకాశం ఉన్న స్థలం అమరావతి* ..

*02. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన చారిత్రక స్థలం అమరావతి* …

*03. పొల్యూషన్ ప్రమాదం లేదు – పచ్చదనం కావలసినంత పెంచుకోవచ్చు*

*04. ఇహ ఇంటర్నేషనలా ఎయిర్ పోర్టు – నేషనల్ లెవల్ రైల్వే స్టేషన్ల వగైరాలు కేంద్ర ప్రభుత్వం మనసు పెట్టి గట్టిగా తలచుకుంటే మూడు నాలుగేళ్ళలో పూర్తి చేసేయటం వారి చేతిలో పని*…

*05. రోడ్డు – వాయు – రైలు – జల రవాణాలన్నిటికీ సకల సదుపాయాలూ కలిగిన ప్రదేశం* …

*06. ఇహ జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తయితే – కృష్ఞా గోదావరుల పుణ్యమాని రాజధానికి నీటి సమస్య ఉండే ప్రసక్తే లేదు*

*07. రైలు – రోడ్డు మార్గాలలో చెన్నై – బెంగళూరు – హైదరాబాద్ లాంటి మెట్రో మహా నగరాల నుండి కేవలం ఒక రాత్రి ప్రయాణం* ..

*08. బాంబే – ఢిల్లీ – కలకత్తాల నుండి ఒక రోజు ప్రయాణం* …

*09. సమీపంలో ఉన్న మూడు మెట్రో నగరాలకీ డైరక్టు హైవే పడితే ఆటోమేటిక్ గా ఆ మధ్యనున్న అన్ని ప్రాంతాలు అభివృద్ధిపథంలో పరుగులు పెడతాయి*…

*10. దేశంలో ఆల్మోస్ట్ అన్ని ప్రాంతాలకీ రైలు – రోడ్డు మార్గాల కనెక్టీంగ్ హబ్ గా ఉన్న బెజవాడ లాంటి నగరం దగ్గరలో ఉండటం కూడా మరో అనుకూలాంశం*

*11. తిరుపతి – కాలహస్తి – శ్రీశైలం – భద్రాద్రి – బెజవాడ లాంటి పుణ్య క్షేత్రాలకి కూడా ఐదారు గంటల ప్రయాణపు దూరంలో ఉండటం మరో మంచి అవకాశం*…

*12. ప్లాను డిజైన్ల కోసం కూడా పెద్దగా జుట్టు పీక్కోవలసిన అవసరం లేదు. ఆల్రెడీ అమరావతి కోసం తయారు చేయబడిన బ్లూ ప్రింటుని యధాతదంగా వాడేసుకోవచ్చు*

అంబేడ్కర్ లాంటి పెద్దలు , మహానుభావులు అంతా అప్పటి కాలమాన పరిస్థితుల బట్టి హైదరాబాదుని ప్రతిపాదించి ఉంటారు ..

కానీ – నాటికీ నేటికీ అనేక రకాలైన మార్పులు సంభవించాయి. నాటి అనుకూల పరిస్థితులు నేడు ప్రతికూలంగా మారిపోయాయి…

కావున – ఆల్రెడీ మహా నగరాలుగా అభివృద్ధి చెందిన చోటే మరో రాజధాని ఏర్పాటు చేసేకంటే – ఇరికించే కంటే – అమరావతి కాకపోయినా – మరెక్కడైనా అంతగా అభివృద్ధి చెందని ప్రాంతంలోనైనా సరే ఏర్పాటు చేస్తే బాగుంటుందని – దేశం నాలుగు మూలలా అభివృద్ధి చెందినట్టు అవుతుందని నా అభిప్రాయం …

కేవలం – *కొత్త రాజధాని నిర్మాణానికి అమరావతికి ఉన్న అనేక అనుకూల అంశాల దృష్ట్యా దాని పేరు ప్రతిపాదించటం జరిగింది* తప్ప … మరే రకమైన ఉద్దేశమూ లేదని గ్రహించ ప్రార్థన …

భాజపా తరువాత ఎక్కువ మంది యంపీల బలం కలిగిన ఆంధ్రా అధికార పార్టీ తలచుకుంటే ఇది అసాధ్యం కాకపోవచ్చు …

కావలిస్తే ఎలాగూ వివాదాల మధ్య నలుగుతున్న రాష్ట్ర రాజధానిని వారికి నచ్చిన చోటుకి మార్చుకోవచ్చు – ఎవరికీ అభ్యంతరం ఉంటుందని అనుకోను …

అవసరం అయితే టీవీ చానెళ్ళన్నీ ఈ అంశం మీద ఓ వారం పాటూ చర్చా వేదికలు ఏర్పాటు చేస్కోవచ్చూ .

*దక్షిణ భారతావని దశ – దిశ మార్చే అవకాశం ఉంటుంది…!!*

About The Author