బాధ్యతల అప్పగింత… ఆపై నెలరోజుల సెలవు మాజీ సీఎస్ ఎల్వీ నిర్ణయం…
సోమవారం నాడు అకస్మాత్తుగా సీనియర్ ఐఏఎస్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జగన్ సర్కార్ తక్షణం బదిలీ చేస్తూ… బాపట్ల లోని హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది…
అయితే నేటి ఉదయం తన బాధ్యతలను తాత్కాలిక సీఎస్ నీరబ్‌కుమార్‌కు అప్పగించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి సంస్థ (హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించకుండానే సెలవుపై వెళ్ళారు. డిసెంబర్6వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు.