తహశీల్దార్ విజయారెడ్డి అకాల ”బలి” తో నైనా రెవెన్యూ వ్యవస్థ కళ్ళు తెరవాలి


చనిపోయిన తహశీల్దార్ విజయ గురించి తప్పితే, చావు బ్రతుకుల మధ్య ఉన్న సురేష్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు….???

*ఇప్పటివరకు భూసమస్యలు పరిష్కారం కాక వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, మరి ‘తిండి’ తక్కువై ఏ ఒక్క తహశీల్దార్ అయినా ఆత్మ హత్య చేసుకున్నారా…????*

తహశీల్దార్ ప్రాణానికి విలువుంది, వేలాది మంది పేద రైతుల ప్రాణాలకు విలువ లేదా…????

*తహసీల్దార్ కార్యాలయం లోనే ఒక రైతు తహసీల్దార్ పై కిరోసిన్ పోసి నిప్పంటించేయాలనుకున్నంత కసిని పెంచుకుని వచ్చి హతమార్చాడంటే, ఆ తహశీల్దార్ ఆ రైతును లంచం కోసం ఎన్ని రోజులు, మరెన్ని విధాలుగా ఇబ్బంది పెట్టుంటుందో ఊహించండి…..!?
ఎంత నరకం చూపించిందై ఉంటుందో ఆలోచించండి..!*

*అలాంటి విపత్కర పరిస్థితుల్లో చివరి యత్నంగా, నా ప్రాణం పోయినా ఫర్వాలేదు అనే ఉద్దేశ్యంతో నే దాడికి పాల్పడ్డాడేమో గానీ, అక్రమంగా లంచాలు తీసుకుని అన్యాయంగా డబ్బు సంపాదించాలని కాదుకదా!!!*

వేలాది మంది రైతులు చనిపోతే ఒక్కడు స్పందించడు గాని ఇప్పుడు ఎవరో ఒక తహసీల్దార్ చనిపోతే భూకంపమే వచ్చినట్టు మాట్లాడుతున్నారు…

ఆ రైతు తహసీల్దార్ ను చంపితే అతనికి ఏమైనా కోట్లు వస్తాయా లేక ఆమె ఆస్తులు వస్తాయా ఆలోచించండి…. లేదా అతడు అక్రమంగా వేరొకరి భూమిని తన పేరిట చేయమన్నాడా..? అతను అక్రమార్కుడే అయితే భూమి మాట దేవుడెరుగు కానీ, తానుకూడా చావుకు సిద్దపడ్డాడు కదా, మరి అతను అక్రమార్కుడెలా అవుతాడు…..!!!???

అతనికే కాదు, లంచావతారాలైన అధికారులను నిలువునా కోసి కారం పెట్టాలన్నంత కసి ప్రతి ఒక్కరికీ ఉంటుంది కానీ వాళ్ళ కాళ్ళవేళ్ళా పడడం తప్ప ఇంకేం చేయలేరు, కాకపోతే ఓ రైతు ఒకే ఒక అడుగు ముందుకు వేసి ఇలా ఎమోషనల్ గా చేసాడు…… అది ముమ్మాటికీ తప్పే నేను కాదనను కానీ ఎందుకు అలా చేయవలసి వచ్చిందో విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..!
*ప్రతీ రెవెన్యూ ఉద్యోగి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది*

*ఏ కార్యాలయం లో చుసినా ఇదే తంతు లంచం.. లంచం… ప్రతీదానికి లంచం..బర్త్ సర్టిఫికేట్ కు లంచం.. లైవ్ సర్టిఫికేట్ కు లంచం… ఆఖరికి డెత్ సర్టిఫికేట్ కు కూడా లంచం….! పాసుబుక్ ఇవ్వాలంటే లంచం… వచ్చిన పాసుబుక్ తీసుకోవాలంటే లంచం… వచ్చిన పాస్ బుక్ ఉండాలంటే లంచం…. వేరోడికి మన భూమి పట్టా చేయకుండా ఉండాలన్నా లంచం……లంచం లంచం….లంచం…!*

ఆ రైతుపై కావాలని బురద చల్లకండి…. అతను చేసిన పనికి తప్పు పట్టవచ్చు కానీ, ఎందుకు చేసాడో ‘తెలిసిన’ ఆ పనికి ఊరికెనే అతడిని తప్పు పట్టొద్దు ప్లీజ్…!

*తహశీల్దార్ విజయ ఆత్మ కు శాంతి కావాలంటే, ఇదే మొదటి మరియు చివరి హత్యాకాండగా చరిత్రలో నిలిచిపోవాలంటే సామాన్యుల పట్ల కనికరం చూడండి, కార్యాలయాల చుట్టూ చోటికి మాటికి తిప్పకుండి, ముఖ్యంగా లంచాలు ముట్టకుండా మీకొచ్చే వేలాది,లక్షలాది రూపాయల జీతాలతో మీ జీవితాలను ఎంజాయ్ చేయండి…… లేదు, కాదు, కూడదు అంటే కోట్లు కూడబెట్టినా ఎప్పుడు, ఎక్కడ, ఎలా బలౌతారో తెలియకుండా బలిపశువులౌతారు…. తస్మాత్ జాగ్రత్త……!*

About The Author