అయోధ్య వివాదంపై సుప్రీం ఏకగ్రీవ తీర్పు..!


వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదే: సుప్రీం కోర్టు

అయోధ్య వివాదాస్పద స్థలం హిందూవులదేనని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. 

2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు.

మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు.

స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశం.

ఏకగ్రీవ తీర్పు వెలువరించిన ఐదుగురు  న్యాయమూర్తులు..
అయోధ్య భూవివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఐదుగురు న్యాయమూర్తులు ఏకగ్రీవ తీర్పును వెలువరించారు. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదే అని స్పష్టం చేసింది..
అయోధ్యలో 5 ఎకరాల స్థలాన్ని కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్‌ బోర్డుకు ఇవ్వాలని ఆదేశించింది సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం.
వివాదస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్​ ఏర్పాటు చేయాలి: సుప్రీం
వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్ర ప్రభుత్వం  ట్రస్ట్ ఏర్పాటు చేయాలి.
వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ అధీనంలో ఉంచాలి.
ఆలయ నిర్మాణం, ట్రస్ట్ విధివిధానాలపై 3 నెలల్లోగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి
మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి: సుప్రీం
డిసెంబర్‌ 16, 1949 వరకు ముస్లింలు నమాజ్‌ చేసేవారు.
అలహాబాద్‌ హైకోర్టు ఉమ్మడి అధీనం కోసమే ఆదేశాలిచ్చింది.
మతపరమైన వివక్షకు రాజ్యాంగంలో స్థానం లేదు.
మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలి
1956కు ముందు ఆ స్థలం తమ అధీనంలో ఉందని నిరూపించేందుకు ముస్లింలు ఆధారాలు చూపలేకపోయారు బాబ్రీ మసీదు కూల్చివేత సరైనదని కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 1949లో విగ్రహాలను పెట్టి మసీదును అపవిత్రం చేయడం, 1992లో మసీదును కూల్చివేయడం చట్టాన్ని ఉల్లంఘించడం కిందికే వస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ స్పష్టం చేశారు. ‘‘బాబ్రీ మసీదును కూల్చివేసినందున… జరిగిన తప్పును పరిమితం చేయాల్సిందే..’’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ముస్లింలకు ప్రత్యామ్నాయ ప్రదేశం చూపించాలని ఆదేశించారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల మేర తగిన స్థలాన్ని ఇవ్వాలని జస్టిస్ గొగోయ్ పేర్కొన్నారు. మసీదు నిర్మాణానికి స్థలం కేటాయించేందుకు ట్రస్టు ఏర్పాటు చేయాలని సూచించారు.

About The Author