అమ్మాయితో గోరుముద్దలా. రాజయ్యా.. ఏందయ్యా అది..?
అమ్మాయితో గోరుముద్దలా..! అంత గోరోజనం ఎందుకు రాజయ్యా..?
జనగామ:ప్రజా జీవితంలో ఉన్న రాజకీయనేతలకు కొన్ని పరిమితులు ఉంటాయి. వాటిని అతిక్రమించి వ్యవహరిస్తే అసహ్యంగా పరిణమిస్తాయి. ప్రజలు సినిమా నటులు అన్నా, రాజకీయ నేతలు అన్నా కొంత అభిమానంతో వ్యవహరిస్తుంటారు. కొన్ని సందర్బాల్లో వారి అభిమానాన్ని చాటుకోవడానికి రకరకాల సర్కస్ స్కిట్ లను చేస్తుంటారు. వాటిని కొంతమంది నాయకులు. సినిమా స్టార్లు ముందస్తుంంగా గమనించి అభిమానులను సున్నితంగా నియంత్రిస్తుంటారు. అంతే కాకుండా వారి ఇష్టాలకు తలవంచితే నటుగురిలో అబాసు పాలు కాక తప్పదు. కొన్ని సందర్బాల్లో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చే ప్రమాదం లేక పోలేదు.
తెలంగాణ మాజీ వివాదాల మంత్రి తాటికొండ రాజయ్మ ఇటీవల చేసిన చేసిన ఓ ఘనకార్యం ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పదవ తరగతి చదువుతున్న అమ్మాయి అత్యుత్సాహానికి అడ్డుకట్ట వేయాల్సింది పోయి అమె చేత్తో గోరుముద్దలు పెట్టించుకున్న వైనం అందరి చేత ఛీ కొట్టిస్తోంది. ఎంత ప్రజా ప్రతినిధి ఐతే మాత్రం ఓ అమ్మాయితో ప్రజల సమక్షంలో అన్నం తినిపించుకోవడం ఏంటనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పక్కన