ఉండవల్లిగుహల్లో పవళించి వున్న అనంతపద్మనాభుని ఏకశిలా విగ్రహం..


విజయవాడకు సమీపంలో వున్న ఉండవల్లిగుహల్లో పవళించి వున్న అనంతపద్మనాభుని
ఏకశిలా విగ్రహమిది.దక్షిణాదిలోనితిరువనంతపురంలో ఇటువంటి విగ్రహమేవుంది.ఇది
అరుదైనవిగ్రహం.స్వామి పవళింపుసందర్భం.మూడంతస్తులున్న ఉండవల్లి గుహల్లోరెండో
అంతస్తులో ఈ విగ్రహంవుంది.క్రీ.శ.మూడు…..ఏడుశతాబ్దాల మధ్యచాళుక్యులు ఈ గుహలనుతొలిపించారనిఅంటున్నారు.మొదటి అంతస్తులో త్రిమూర్తులున్న త్రికుటాలయం
వుంది.కింద మండపం నిర్మాణం మాత్రం అసంపూర్తిగావుంది.దక్షిణాదిలో ఉండవల్లి గుహలు
అపురూపమైనవి. కొండను తొలిచి సొరంగనిర్మాణాలు చేశారు.ఒక సొరంగం సమీపంలో వున్న
మంగళగిరి కొండ కు,రెండోది విజయవాడ కనకమ్మ గుడికొండకు చేరుకోవటానికి వీలుగా…
తవ్వించారట.మంగళగిరి కొండ పానకాలరాయుడి ఆలయంపక్కనే దీనికి కలుపబడినట్లు
చెబుతున్న సొరంగం మార్గాన్ని చూడొచ్చు.

కాగా కొండను కదిలించకుండా ..కొండలోనేగుహలు, మూడంతస్తుల నిర్మాణాలు.,
ప్రతి అంతస్తులో రమణీయ శిల్పాలు…ముఖ్యంగా అనంతశయనుడి పవళింపువిగ్రహం

About The Author