తిరుపతిలో ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం 

తిరుపతి,  నవంబర్ 11: రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి గ్రామానికి నవరత్నాలు అమలు చేసి నీతివంతమైన పరిపాలన తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి సోమవారం ఉదయం స్థానిక యూనివర్సిటీ ఆడిటోరియంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి సందర్భంగా మైనారిటీల సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవాలు సందర్భంగా జిల్లాలో విద్యార్థులకు డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం విద్యా పురష్కర్- 2019 అవార్డుల ప్రధాన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ముఖ్యఅతిధిగా పాల్గొనగా, ప్రభుత్వ విప్, సత్యవేడు శాసనసభ్యులు, ఎమ్మెల్సీ ఎండపల్లి శ్రీనివాసులరెడ్డి ఆజాద్  చిత్రపటానికి పూలమాలలు సమర్పించి, జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ మక్కాలో జన్మించిన ఆజాద్ జాతీయ , మత సమైక్యతకు పాటుపడి,  స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహానుభావుడని అన్నారు. అదే స్ఫూర్తితో నేడు మన ముఖ్యమంత్రి నవరత్నాల అమలు కు ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు.

విద్యకు  ప్రాధాన్యత ఇచ్చి అమ్మఒడి, నాడు-నేడు ప్రభుత్వ పాఠశాలలో అమలు లక్ష్యంగా చేస్తున్నారని అన్నార

About The Author