శ్రీకార్తీక పురాణము 17వ అధ్యాయము


ఆంగీరసుడు ధనలోభునకు చేసిన తత్త్వోపదేశము
ఓ మునిశ్రేష్ఠులారా! ఓ ధనలోభీ! నీకు కలిగిన సంశయములకు సమాధనము చెప్పుతున్నాను, వినుము.
కర్మలవలన ఆత్మకు దేహధారణము సంభవిస్తున్నది. కావున శరీరోత్పత్తికి కర్మ కారణగుతున్నది. శరీర ధారణము వలననే ఆత్మ కర్మను చేయుచున్నది.కనుక కర్మచేయుటకు శరీరమే కారణమగుచున్నది. స్థూల సూక్ష్మ శరీర సంబంధములవలన ఆత్మకు కర్మసంబందము కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతిదేవికి వివరించెను. దానిమీకు నేను వివరించుచున్నాను. ‘ఆత్మ’ అనగా ఈ శరీరంలో నహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది. అని అంగిరసుడు చెప్పగా
“ఓ మునీంద్రా! నేనింతవరకు ఈ దేహమే ఆత్మయని భావించుచుంటిని. కనుక ఇంకా వివరంగా చెప్పబడిన వాక్యార్థమునకు పాదార్థజ్ణానము కరణమగుచుండును. కావున ‘అహంబ్రహ్మ’ అను వాక్యార్థమును గురించి నాకు తేలియజేయండి” అని ధనలోభుడు కోరెను.
అప్పుడు ఆంగీరసుడు ” ఈ దేహము అంతఃకరణవృత్తికి సాక్షియే. ‘నేను – నాది’ అని చెప్పబడు జీవాత్మయే ‘అహం’ అను శబ్దము. సర్వాంతర్యామియై సచ్చిదానందరూపమైనదే పరమాత్మ ‘నః’ అను శబ్దము. ఆత్మకు ఘాటాదులు వలె శరీరమునకు అర్థము లేదు. ఆ ఆత్మ సచ్చిదానంద స్వరూపము, బుద్ధి సాక్షి జ్ణానరూపి శరీరేంద్రీయములు మొదలైనవాటిని వ్యాపారమునందు ప్రవర్తింపజేసి వానికంటే వేరుగా వున్నదై యెల్లప్పుడు ఒకేరీతిన ప్రకాశిస్తుండేదే ‘ఆత్మ’ అనబడును. ‘నేను’ అనునది శరీరెంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొనుము.ఆ దేహేద్రియాలన్నింటిని ఏది ప్రకాశింపజేయునో అదే ‘నేను’ అని నిశ్చయము. అందుచేత అస్థిరములగు శరీరేంద్రియాదులు కూడా నామరూపములతో వుండి నశించునవేగాక, ఇట్టి దేహామునకు జాగ్రత స్వప్నసుషుప్త్యవస్థలు స్తూల సూక్ష్మాకార శరీరములు అను మూడింటియందూ “నేను” “నాది” అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము.
ఇనుము సూదంటు రాయిని అంటిపెట్టుకొని తిరిగేటట్లు శరీర, ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుతుండునో అదే ఆత్మ. అట్లే అవి ఆత్మవలన తమ పనిని చేయును. నిద్రలో శరీరేంద్రియాల సంబంధము లేక గాఢనిద్రపోయి, మేల్కోన్న తర్వాత ‘ నేను సుఖనిద్రపోతిని, సుఖముగా వున్నది’ అను అనుకొనునదే ఆత్మ.
దీపము గాజుబుడ్డిలో వుండి ఆ గాజును ప్రకాశింపచేయునట్లే ఆత్మకూడా దేహేంద్రియాలను ప్రకాశింపజేయుచున్నది. ఆత్మపరమాత్మ స్వరూపము అగుటవలన దానికి దారా పుత్రాదులు ఇష్టమగుతున్నారు. అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదే ‘పరమాత్మ’ అని గ్రహింపుము. ‘తత్త్వమసి’ మొదలైన వాక్యమందలి ‘త్వం’ అను పదానికి కించిత్ జ్ణత్వాది విశిష్టమందు జీవాత్మయని అర్థం “తత్” అనుపదమునకు సర్వజ్ణత్వా దుగుణ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. “తత్వమసి” అనేది జీవాత్మపరమాత్మల ఏకత్వనే బోధించును. ఈ రీతిగా సర్వజ్ణత్వాది ధర్మములను వదిలివేయగా సచ్చిదానందరూపమొక్కటే నిలుచును. అదే ఆత్మదేహలక్షణము ఉండుట-జన్మించుట-పెరుగుట-క్షీణించుట-చచ్చుట మొదలగు ఆరు భాగలు శరీరానికే గాని ఆత్మకులేవు. జ్ణానానందస్వరూపామే పూర్ణత్వము గలది వేదములో దేనికి సర్వజ్ణత్వము, ఉపదేశము, సంపూర్ణత్వము నిరూపించబడినదో అదే ‘ఆత్మ’. ఒక కుండను చూసి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అలాగే ఒక దేహాంతర్యామి అగు జీవాత్మ పరమాత్మయని తెలుసుకొనుము.
జీవులచే కర్మఫలమును అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడని, జీవులా కర్మఫలముని అనుభవింతురని తెలుసుకొనుము. అందువలన మానవుడు గుణసంపత్తుగలవాడై గురుశుశ్రూష నొనర్చి సంసార సంబంధములగు ఆశలన్నీ విడచి విముక్తి పొందవలెను. మంచి పనులు తలచిన చిత్తశుద్దియు, దానివలన భక్తిజ్ణాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును. అందువలన సత్కర్మానుష్ఠానము చేయవలెను. మంచిపనులు చేసినగాని ముక్తి లభింపదు” అని ఆఅంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కారించి ఇట్లనెను.
తదుపరి వివరణ 18వ అధ్యాయములో.

17వ అధ్యాయము సమాప్తము
కార్తీకమాస 17వ రోజున ఆచరించవలసిన దానధర్మలు – జపతపాది విధులు – ఫలితములు

పూజించాల్సిన దైవము → అశ్వనీ దేవతలు
జపించాల్సిన మంత్రము → ఓం అశ్విన్యౌవైద్యౌతేనమః స్వాహా
నిషిద్ధములు → తరిగిన వస్తువులు, ఉల్లి, , ఉసిరి,చద్ది, ఎంగిలి, చల్ల
దానములు → ఔషధాలు, ధనం
ఫలితము → సర్వవ్యాధీనివారణం, ఆరోగ్యం

About The Author