యువతిని రంపం మిల్లులో కోసేశారు…


1990ల్లో కశ్మీరులో పరిస్థితిపై సునందా వశిష్ఠ్‌ వెల్లడి!

వాషింగ్టన్‌: కశ్మీరులో హిందువులపై 1990లో జరిగిన దారుణాలు అన్నీఇన్నీ కావని కాలమిస్టు సునందా వశిష్ఠ్‌ అమెరికన్‌ కాంగ్రెస్‌కు వివరించారు.

మానవహక్కులపై కాంగ్రెస్‌ నిర్వహించిన విచారణ సందర్భంగా ఆమె మాట్లాడారు.

అత్యంత భయానక అనుభవాలను ఎదుర్కొని మూగవోయిన కశ్మీరీ హిందువుల గొంతుకలను ఈ రోజు తన స్వరం ప్రతిధ్వనిస్తోందంటూ ఆమె నాటి కొన్ని విషాదఘటనలను ప్రస్తావించారు.

ఓ స్కూలులో ల్యాబ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తూ దుండగుల అకృత్యానికి బలైపోయిన ఓ యువతి కన్నీటిగాథను వినిపించారు.

‘‘ఆరోజు ఆమెను కొందరు దుండగులు అపహరించారు.

కళ్లకు గంతలు కట్టి ఆమెపై అత్యంత దారుణరీతిలో అత్యాచారానికి ఒడిగట్టారు.

జీవచ్ఛవంలా మారి తీవ్రవేదన చెందుతున్న ఆమెను అంతటితో వదలకుండా పక్కనే ఉన్న చెక్కలు కోసే యంత్రంలోకి ప్రాణాలతో ఉండగానే తోశారు.

రంపం ఆమె శరీరాన్ని రెండుముక్కలుగా చీల్చేసింది.’ అని ఆవేదన భరిత స్వరంతో చెప్పారు.

ప్రాణభయంతో ఓ ధాన్యం గాదెలో దాక్కుని ఉన్న హిందూ యువకుడిని ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా కాల్చేసి..

ఆయన రక్తం కలిపిన ఆహారాన్ని భార్య చేత బలవంతంగా భయపెట్టి తినిపించిన ఘటనను సునంద వివరించారు.

ఇలాంటి అకృత్యాలెన్నో కశ్మీరీ హిందువులను ప్రాణాలు అరచేతబట్టుకుని పారిపోయేలా చేశాయన్నారు.

ఇటీవల 370 అధికరణాన్ని రద్దు చేయడం అక్కడ మానవహక్కులను పునరుద్ధరించడమేనంటూ ఆమె హర్షం వ్యక్తం చేశారు.

About The Author