విరుచుకుపడ్డ మంచు చరియలు, నలుగురు భారత సైనికుల దుర్మరణం…

https://www.facebook.com/262678680484045/posts/2568533406565216/

విరుచుకుపడ్డ మంచు చరియలు
నలుగురు భారత సైనికుల దుర్మరణం
మరో ఇద్దరు కూలీలు కూడా మృతి
సియాచిన్ దుర్గటనతో విషాద ఛాయలు

సముద్ర మట్టానికి 18,000 అడుగులకు పైగా ఎత్తులో ఉన్న సైనిక శిబిరంపై ( ఉత్తర సియాచిన్ ) మంచు చరియలు విరుచుకుపడ్డాయి. ఈ దుర్గటనలో నలుగురు సైనికులతో పాటు మరో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. సోమవారం మూడు గంటల ప్రాంతంలో తీవ్ర హిమపాతం మధ్య ఈ సంఘటన చోటు చేసుకుంది. సమాచారాం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంచు శిధిలాల కింద ఉన్న మొత్తం ఎనిమిది మందిని బయటకు తీసారు. ఇందులో తీవ్రంగా గాయపడిన ఏడుగురిని సమీప సైనిక ఆసుపత్రికి తరలించారు. వీరిని కాపాడటానికి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికి నలుగురు సైనికులు మరో ఇద్దరు కూలీలు దుర్మరణం చెందారు. ఇటివల రోజుల్లో ఇది పెద్ద సంఘటన కావడంతో సైనిక శిభిరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి ఆత్మలకు శాంతి కలగాలని మనము ప్రార్దిద్దాం. కాగా మృతి చెందిన వారి పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

( సియాచిన్ లో విధుల నిర్వహణ, అక్కడి పరిస్థితులపై NTV గతంలో అందించిన ప్రత్యేక కథనంలో చూడవచ్చు )

About The Author