రైల్వే విధులు నిర్వహిస్తున్న శునకం…


చెన్నై పార్క్‌టౌన్‌ రైల్వేస్టేషన్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే పోలీసులు ఊరుకున్న ఒ కుక్క మాత్రం ఊరుకోదు…ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే అరుస్తూ పోలీసుల్ని అప్రమత్తం చేస్తుంది.రన్నింగ్ ట్రైన్ ఎక్కిన ప్లాట్ ఫామ్ మీద వున్న వెంటనే అరుస్తుంది.ఇంతలా చేస్తున్న ఈ కుక్క బాగా ట్రైనింగ్ అయిన కుక్క అనుకుంటే పొరపాటే… ఇది ఒక పెంపుడు కుక్క. దీని యజమాని దీన్ని రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో వదిలివెళ్లారు. అప్పటి నుండి స్టేషన్ లొనే ఉంటూ, ప్రయాణికులు పెట్టే ఆహారం తింటూ.. ప్రమాదాల నుంచి జనాల్ని అప్రమత్తం చేస్తోంది. రైళ్లు వస్తుండగా.. మధ్యలో ట్రాక్‌ దాటాలని ప్రయత్నించేవారిపై, కదులుతున్న రైలు నుంచి దిగడం లేదా ఎక్కేవారిపై, ఫుట్‌బోర్డులో ప్రయాణించే వారిపై అరుస్తూ పోలీసులను అప్రమత్తం చేస్తుందని రోజువారీ ప్రయాణికులు తెలిపారు.ఇలా రైల్వే విధులు నిర్వహిస్తున్న కుక్కను ప్రయాణికులు కూడా అభినందిస్తున్నారు. ఇలా రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్పీఎఫ్‌)తో పాటు గస్తీ కాస్తూ వారికి విధుల్లో సహకరిస్తోంది.

About The Author