ఢిల్లీ కాలుష్యం కష్టాలు కంటిన్యూ…


ఢిల్లీలో కాలుష్యం కష్టాలు కొనసాగుతున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా గాలి కాలుష్యం ప్రమాదకరంగానే నమోదమవుతోంది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQl) డేంజర్ గానే ఉంది. అశోక్ విహార్, ఆనంద్ విహార్ లో AQl 309 పాయింట్లుగా ఉంది. ఇది అత్యంత ప్రమాదకరస్థితి. లోధి ఏరియాలో AQl 201 గా ఉంది. గత వారం
రోజుల్లో ఇదే అత్యధికం. చలి తీవ్రత పెరగడంతో.. గాలి కాలుష్యం పెరుగిపోతోందని అధికాతులు
చెబుతున్నారు గాలి కాలుష్యానికి మంచు కూడా తోడైంది. దీంతో ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు
పడుతున్నారు. ఢిల్లీ కాలుష్యం పై ఇవాళ పార్లమెంటరీ కమిటి సమావేశం కానుంది. కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన
చర్యలపై చర్చించనుంది.

కాలుష్య తీవ్రత తగ్గించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాలని ఢిల్లీ ప్రజలు ఆరోపిస్తున్నారు. శివారు ప్రాంతాల్లో రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టడం వల్లే గాలి కాలుష్యం పెరిగిందంటున్న
అధికారులు..రైతులను ఎందుకు అడ్డుకోలేకపోయారని మండిపడుతున్నారు.

About The Author