స్కూల్ టూర్‌ కోసం వృద్ధాశ్రమానికి వెళ్తే… అక్కడ నానమ్మ కనిపించింది

వందమాటల్లో చెప్పలేని విషయాలను ఒక్క ఫొటోతో చెప్పొచ్చంటారు. అలాంటి ఒక ఫొటో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫొటోతో పాటు దానిపైన రాసిన వివరణను కూడా చాలామంది షేర్ చేస్తున్నారు.ఒక స్కూల్ యాజమాన్యం విద్యార్థులను వృద్ధాశ్రమానికి తీసుకెళ్లింది. అక్కడ ఈ ఫొటోలో ఉన్న అమ్మాయికి తన నానమ్మ కనిపించింది. దాంతో ఇద్దరూ ఇలా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ అమ్మాయి తన నానమ్మ గురించి ఇంట్లో అడిగినప్పుడల్లా, ఆమె బంధువుల దగ్గర ఉంటోందని ఇంట్లో వాళ్లు చెప్పేవారు. ఎలాంటి సమాజాన్ని మనమంతా నిర్మిస్తున్నాం’ అనే వ్యాఖ్యలు ఈ ఫొటోపైన రాసున్నాయి.

ఆశ్రమాలులేని సమాజాన్ని నిర్మిద్దాం!

ఇంట్లో ఎంతమంది వున్నా బరువు కాకుండా పెంచారు తల్లిదండ్రులు. మనం ఆ ఇద్దరిని పెంచలేమా? ఈ సమాజం ఎటుపోతోంది.

About The Author