అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం విడుదల చేసిన కొత్తమ్యాప్ ఇదే

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్తమ్యాప్‌ను విడుదల చేసింది. కేంద్రం విడుదల చేసిన ఇండియా మ్యాప్‌లో అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించారు.

అమరావతిని రాజధానిగా గుర్తించాలంటూ పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్‌ కేంద్రాన్ని కోరారు. ఆయన కోరిన మరుసటి రోజే కొత్త మ్యాప్‌ను కేంద్రం విడుదల చేసింది. ఇండియా మ్యాప్‌లో అమరావతి లేకపోవడాన్ని గుర్తించామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో గల్లా జయదేవ్‌ లేవనెత్తిన విషయంపై దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అందుకే ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ కొత్త మ్యాప్‌ విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన మ్యాప్‌లో ఏపీ రాజధానిగా అమరావతిగా గుర్తించలేదు. దీనిపై రాజకీయ పార్టీల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదిలా ఉంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. రాజధాని అమరావతిని పక్కన పెట్టారు. దీనిపై ఓ కమిటీ వేశారు. ఆ కమిటీ ఇప్పుడు అధ్యయనం చేస్తోంది.

About The Author