Calculated Risk.. రాజకీయాల్లో ఇది చాలా కీలకమైన ఆట.. ఆంధ్రాలో NDA కి దూరం అయ్యి బాబులాంటి వాళ్ళు ఆడిన తర్వాత ఈ రోజు టీడీపీ పరిస్థితి ఏంటో చూసాం..

మహారాష్ట్ర లో శివసేన ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే మొదలుపెట్టారు.కలిసి పోటీ చేసి 105 సీట్లు సాధించిన బీజేపీ,56 సీట్లున్న శివసేన సాధించిన తర్వాత సీఎం పీఠంపై పేచీ పెట్టి బీజేపీని ల్,అమిత్ షా ని ఇబ్బంది పెడదాం అని చూసిన ఉద్ధవ్ మొదలుపెట్టిన ఈ ఆట చివరికి ఆ పార్టీ ఉనికినే అంధకారంలోకి నెట్టేసింది.ఆట మొదలు పెట్టింది శివసేన అయితే.. ఎక్కడా సంయమనం కోల్పోకుండా బీజేపీ అన్ని ఎత్తులూ తెలివిగా వేసి,ప్రజల దృష్టిలో శివసేన అధికార దాహం పట్ల ఏవగింపు కలిగేలా చేసి రాజకీయ పండితులు కూడా ఊహించని విధంగా.. ఆశ్చర్యపోయేలా Calculated Risk ఆటని విజయవంతంగా ముగించింది..

ఆడేది ఎవరితోనో శివసేన గ్రహించలేదు,ఒకప్పుడు బీజేపీ ని అదిలించి అరిచి సాధించినట్లు ఇప్పుడు కూడా చేద్దాం అనుకునే వ్యూహం ఫలించలేదు.

ప్రమాదకారమైన ఆటలో తమ శక్తి యుక్తులని ఎక్కువగా అంచనా వేసి ఇరుక్కుపోయారు..ఇప్పుడు తీరిగ్గా తలలు పట్టుకుంటున్నారు..

Be aware.. This Is Modi-Shah ‘s era.. గుణపాఠం నేర్చుకోకపోతే ఎవరికైనా ఇదే గతి…

About The Author