సూర్యగ్రహణం కార‌ణంగా డిసెంబ‌రు 25, 26వ తేదీల్లో 13 గంట‌ల పాటు శ్రీ‌వారి ఆల‌య త‌లుపులు మూత‌


సూర్యగ్రహణం కారణంగా డిసెంబ‌రు 25, 26వ తేదీల్లో రెండు రోజుల్లో క‌లిపి 13 గంట‌ల పాటు తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.
డిసెంబ‌రు 26న గురువారం నాడు ఉదయం 8.08 గంట‌ల నుండి ఉదయం 11.16 గంట‌ల వరకు సూర్యగ్రహణం ఉంటుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం ఆరు గంటల ముందుగా అనగా డిసెంబ‌రు 25న బుధ‌వారం రాత్రి 11 గంటలకు శ్రీవారి ఆలయం త‌లుపులు మూస్తారు. డిసెంబ‌రు 26న గురువారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ఆల‌యం త‌లుపులు తెరిచి ఆలయశుద్ధి అనంత‌రం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నం ప్రారంభ‌మ‌వుతుంది. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.

About The Author