బయోడైవర్సిటీ ప్రమాదానికి 1000 జరిమానా…


మూడురోజుల క్రితం హైదరాబాద్ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ మీద కారు దాదాపు 105 కి.మీ. వేగంతో దూసుకెళ్లి19 మీటర్ల ఎత్తు నుంచి అమాంతం కింద పడిపోయింది. కారు మీద పడిపోవడంతో.. మణికొండకి చెందిన ఓ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. కూతురు ఎదురుగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి సీటు బెల్టు పెట్టుకోవడంతోపాటు ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో కొద్దిపాటి గాయాలతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. స్పీడ్ గా కారును డ్రైవింగ్ చేసిన కల్వకుంట్ల కృష్ణ మిలాన్ రావు పెరు మీద ఆ కారు ఉంది. ఆయన ఎంపవర్ ల్యాబ్స్ ప్రయివేట్ లిమిటెడ్ పేరిట సొంత సంస్థను నడుపుతున్నారు. ప్రమాదానికి కారణం కారును ఓవర్ స్పీడ్‌తో నడపడమేనని ఇంజనీరింగ్ నిపుణులు తేల్చారు.వేగంగా కారు నడిపినందుకు గానూ ఈ కారుపై పోలీసులు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. మిలాన్ రావు మీద కేసు కూడా నమోదు చేశారు. ఈ ప్రమాదం పట్ల మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై వేగ నియంత్రణ, రక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.ప్రమాదంలో మృతి చెందిన సత్యవేణి కుటుంబానికి మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారు ఓవర్ స్పీడ్‌తోపాటు ఫ్లైఓవర్ డిజైన్ కూడా కారణమని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ప్రారంభించి నెల కాకుండానే రెండుంప్రమాదలు జరగడంతో 3రోజుల పాటు ఫ్లై ఓవర్ ను మూసివేశారు జిహెచ్ఎంసి అధికారులు..

About The Author