అనారోగ్య బాధితులకు.. ముఖ్యమంత్రి ఆర్థిక భరోసా…
అనారోగ్య బాధితులకు..ముఖ్యమంత్రి ఆర్థిక భరోసా చంద్రగిరి నియోజకర్గంలో 20 మందికి సాయం
అనారోగ్యంతో బాధపడుతూ, మెరుగైన వైద్య సేవలు పొందలేని నిరుపేదలకు ముఖ్యమంత్రి ఆర్థిక భరోసా కల్పిస్తూ అండగా నిలుస్తారని ప్రభుత్వ విప్, తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రగిరి నియోజక వర్గంలో దాదాపు 20 మంది బాధితులకు రూ.14.70 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు వచ్చాయన్నారు. బాధితులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి చెక్కులను అందించాలని అధికారులను ఆదేశించారు. ఏ ఒక్క నిరుపేద అన్నరోగ్యంతో బాధపడకూడదు.. సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకుంటే అర్హత ఆధారంగా నిధులు విడుదల అవుతుందని వివరించారు. చెక్కులు పొందిన బాధితులు ఎమ్మెల్యే చెవిరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.