ఫారం కోడిగుడ్ల కంటే నాటు కోడి గుడ్లలో చాలా బలం ఉంటుందనీ, శక్తి, ఆరోగ్యం కోసం దాన్ని తింటేనే మంచిదనే ఒక అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అది కేవలం అపోహ మాత్రమే. ప్రజల్లో ఉన్న ఆ భావన వల్లనే గోధుమ రంగు పెంకు ఉన్న గుడ్లు తెల్లటి పెంకు ఉంటుందన్న అభిప్రాయంతో చాలా మంది కాస్త ముదురు రంగు ఉన్న గుడ్లను ఎక్కువ ధరకు కొంటుంటారు. ముదురు రంగు పెంకు ఉన్న గుడ్లు మరింత బలవర్ధకం ఏమీ కాదు. నిజానికి కోడి గుడ్డు పెంకు ఏ రంగులో ఉన్నా వాటిల్లోని పోషకాలు ఒకే విధంగా ఉంటాయి. కాకపోతే నాటు కోడి గుడ్డు పరిమాణం కాస్త చిన్నగానూ, ఫారం కోడి గుడ్లు కాస్త పెద్దగానూ ఉంటాయి. అయితే వాటిల్లోని తెల్లసొన, పచ్చసొనలో పోషక విలువలు మాత్రం ఒకేలా ఉంటాయి. ఆ రెండు రకాల గుడ్లలో ఉండే ఐరన్‌ పాళ్లు కూడా ఒకటే. వినియోగదారులు ముదురు రంగు పెంకు ఉన్న గుడ్లను ఎక్కువ ధర వెచ్చించి కొనడం కేవలం వాళ్ల మానసిక సంతృప్తి కోసం మాత్రమేనని గుర్తించడం మేలు.

About The Author