రేపు ఉదయమే విధుల్లో చేరండి.. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ పిలుపు


ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్ నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం విధుల్లో చేరండని పిలుపునిచ్చారు. ఆర్టీసీకి తక్షణ సాయం కింద రేపు ఉదయంలోపు రూ.100 కోట్లు ఇస్తాం. ఎప్పుడు చెప్పినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం బాధ్యతతో చెప్పింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చినంక ప్రజల పొట్టలు నింపినం, కాని ఎవరి పొట్టలు కొట్టలేదు. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ఎలాంటి కండిషన్లు పెట్టం. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇస్తున్నం. ఆర్టీసీ సంస్థ బతకాలి. ఆర్టీసీ కార్మికులంతా మా బిడ్డలే. ఆర్టీసీ కార్మికులను యాజమాన్యం వేధించకుండా చూస్తాం. కార్మికులను కాదని మేం ఏ నిర్ణయం తీసుకోం.

దేశంలో ఏరాష్ట్రంలో ఇవ్వనంత జీతం అంగన్‌వాడీలకు ఇస్తున్నం. ఆర్టీసీ కార్మికులు యూనియన్ల మాట నమ్మి పెడదారి పట్టారు. దీనికి యూనియన్లే బాధ్యత వహించాలి. రాజకీయ నిరుద్యోగులు చేసిన హంగామ కొంత, ఆర్టీసీ కార్మికులను ప్రతిపక్షాలు బజారున పడేశాయి. ఆర్టీసీ విషయంలో లేబర్ కోర్టు మాకు ఇంకా టైమిచ్చింది. విపక్షాలది నెత్తికాదు, కత్తికాదు.

About The Author