ప్రియాంకరెడ్డి హంతకులకు సింగపూర్ తరహాలో శిక్ష

పవన్ కళ్యాన్ పోలీస్ శాఖ సైతం షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. శివారు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలన్నారు.  ప్రియాంక రెడ్డి హత్యాచారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి బహిరంగంగా శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. ‘శంషాబాద్ లో డాక్టర్ ప్రియాంక రెడ్డిని సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. మూగ జీవాలకు చికిత్స చేసే ప్రియాంక కొందరు మానవ మృగాల బారినపడి అన్యాయమైపోయింది. ఈ ఘోరాన్ని మనసున్న ప్రతి ఒక్కరూ ఖండించాలి. డా.ప్రియాంక రెడ్డి కుటుంబానికి నా తరఫున, జనసైనికుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.  ఇప్పుడు శంషాబాద్ ఘటన అనే కాదు… కొద్దిరోజుల కిందట చిత్తూరు జిల్లాలో ఆడుకొంటున్న చిన్నారిని ఒక దుర్మార్గుడు చిదిమి వేశాడని, మొన్నటికి మొన్న వరంగల్ లో ఓ ఇంటర్మీడియట్ విద్యార్థినిపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడి చంపేశాడన్నారు. నిర్భయ చట్టం తెచ్చినా బాలికలు, యువతులపై అత్యాచారాలు చేసేవాళ్లకు, వేధింపులకు పాల్పడేవారికీ ఎలాంటి బెదురూ రావడం లేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా కఠిన రీతిలో శిక్షించాలని సూచించారు. సింగపూర్ లాంటి దేశాల్లో ఇలాంటి శిక్షలు ఉన్నాయన్నారు.  పోలీస్ శాఖ సైతం షీ టీమ్స్ ను మరింత బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ కోరారు. శివారు ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలన్నారు. విద్యార్థినుల్లో, యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు ప్రాణ రక్షణకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని జనసేనాని సూచించారు.

About The Author