తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పంచ‌మి తీర్థానికి విస్తృత ఏర్పాట్లు : 

తిరుపతి:తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివ‌రిరోజైన‌ డిసెంబ‌రు 1న పంచ‌మితీర్థానికి విశేషంగా భ‌క్తులు విచ్చేసే అవ‌కాశం ఉండ‌డంతో విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్న‌ట్టు టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్ తెలిపారు. తిరుచానూరులో పంచ‌మితీర్థం ఏర్పాట్ల‌ను జెఈవో శ‌నివారం త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా పుష్క‌రిణిలో గేట్లు, పంచ‌మితీర్థ మండ‌పాన్ని ప‌రిశీలించారు. భ‌క్తులు ఇబ్బందులు ప‌డ‌కుండా పుష్క‌రిణిలోనికి ప్ర‌వేశించేందుకు, తిరిగి బ‌య‌ట‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అంత‌కుముందు ఆస్థాన‌మండ‌పంలో అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ పంచ‌మితీర్థానికి వ‌చ్చే భ‌క్తుల ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్ధీక‌రించేందుకు ప‌టిష్టంగా క్యూలైన్లు, బారీకేడ్లు ఏర్పాటు చేశామ‌న్నారు. భ‌క్తుల కోసం 160 అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు, 188 మ‌రుగుదొడ్లు ఏర్పాటుచేశామ‌న్నారు.

About The Author