ప్రియాంక విషయంలో ఆ నలుగురే కాదు…
? 26 ఏళ్ల ఓ ఆడ కూతురు చీకటి పడుతువుతున్న వేళ తన బైక్ ను పార్క్ చేసేందుకు వస్తే నిరాకరించిన టోల్ ప్లాజా సిబ్బంది…
? లారీ బే లో కాకుండా టోల్ ప్లాజా సమీపంలో గంటల తరబడి లారీ ఆపుకుని, మధ్యం సేవిస్తున్నా పట్టించుకోని హైవే పెట్రోలింగ్ సిబ్బంది…
? రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎంతో బిజిగా ఉండే తొండుపల్లి(శంషాబాద్) హైవేపై ఓ యువతిని లాక్కెళుతున్న అటు వైపు దృష్టి పెట్టని వాహనదారులు, స్థానికులు…
? బాటిల్ లో పెట్రోల్ పొయ్యొద్దని ఉత్తర్వులున్నా అర్ధరాత్రి అనుమాన పడకుండా బాటిల్ లోనే పెట్రోల్ పోసిన బంకు సిబ్బంది…
? తమ బిడ్డ కనిపిస్త లేదని నిస్సహాయ స్థితిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ప్రియాంక కుటుంబ సభ్యులకు మా పరిధి కాదంటే మాది కాదంటు తిప్పి పంపిన రెండు పోలిస్ స్టేషన్ల సిబ్బంది…
? పరాయి స్త్రీ మన తల్లి, చెల్లితో సమానం అనే బావన కల్పించకుండా ఆ నలుగురు మృగాలను పెంచి పోషించిన వారి కుటుంబసభ్యులు…
? సంస్కరం, విలువలు, మంచి, చెడు అనే అంశాల జోలికి వెళ్లకుండా కేవలం డబ్బు సంపాదనే లక్షంగా చదువు నేర్పిస్తున్న విద్యా సంస్థలు…
? మన రాజ్యాంగం అమలులోకి వచ్చాక కొన్ని వేల సవరణలు చేసినప్పటికి కామాందులను, కర్కోటకులను నడి రోడ్డుపై కాల్చి చంపేలా చట్టాలను మార్పుచేయలేకపోతున్న ప్రభుత్వాలు…
? ప్రియాంక రెడ్డి లాంటి ఘటనలు జరిగిన నాలుగు రోజులు సోషల్ మిడియాలో హడావిడి చేసి ఆ తర్వాత ఎవరి పనిలో వారు బిజీ అయిపోయే నువ్వూ నేను అందరం…
.