ఇక నుంచి రాష్ట్రంలో జీరో ఎఫ్‌ఐఆర్‌. స్టేషన్ పరిధికాకున్నా కేసు పెట్టొచ్చు!


ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫిర్యాదులకు సంబంధించి.. “0” (జీరో) ఎఫ్‌ఐఆర్‌ అమలు చేయాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు. ఇందుకు సంబంధించి వారం రోజుల్లో విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. .

జీరో ఎఫ్‌ఐఆర్‌ అమల్లో ఉంటే.. పోలీసు స్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోని పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేయవచ్చు. తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితుల ఫిర్యాదును తిరస్కరించడానికి జీరో ఎఫ్‌ఐఆర్‌లో అవకాశముండదు. జీరో ఎఫ్‌ఐఆర్‌ పేరిట బాధితులు ఏ పోలీసు స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేస్తే.. దానిని స్వీకరించి.. విచారణ జరిపి.. సంఘటనా స్థలం పరిధిలో ఉన్న స్టేషన్‌కు ఫిర్యాదును పోలీసులు బదిలీ చేయాల్సి ఉంటుంది.

About The Author