బస్సుపై రాళ్లు, చెప్పుతో దాడి, పోలీసుల తీరు.. మంగళవారం గవర్నర్‌తో టీడీపీ నేతల భేటీ..
అమరావతి
*రాజధాని పర్యటనలో బస్సుపై దాడి ఘటనను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది*
*మంగళవారం అచ్చెన్నాయుడు నేతృత్వంలోని బృందం గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్‌కు ఫిర్యాదు చేయనున్నారు*
*ప్రభుత్వ ప్రోద్బలంతోనే దాడి జరిగినట్టు గవర్నర్‌కు టీడీపీ నేతల బృందం విన్నవించనుంది*
*గవర్నర్‌తో భేటీ..*
*అచ్చెన్నాయుడు నేతృత్వంలో మధ్యాహ్నం 12 గంటలకు టీడీపీ బృందం గవర్నర్‌ను కలువనుంది*
*వెంకటాయపాలెం వద్ద బస్సుపై దాడి గురించి ఫిర్యాదు చేస్తారు*
*చెప్పుతో దాడి చేశారని కూడా గవర్నర్‌కు తెలియజేస్తారు*
*ఆ సమయంలో పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారని వివరిస్తారు*
*పరిస్థితి బాగుందని 144 సెక్షన్ విధించలేదని ఏపీ డీజీపీ పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది*
*28న పర్యటన..*
*గత నెల 28వ తేదీన ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన బృందంతో కలిసి రాజధాని అమరావతిలో పర్యటించారు*
*ప్రత్యేక బస్సులో పర్యటించిన వీరికి రాళ్లతో వైసీపీ కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు*
*చంద్రబాబు బృందం బస్సు వెంకటాయపాలెం వద్దకు రాగానే వైసీపీ కార్యకర్తలు చెప్పు కూడా విసిరారు*
*చెప్పు విసిరింది ఆందోళనకారులు కాదని… వైసీపీ కార్యకర్తలని చంద్రబాబు ఆరోపించారు*
*వైసీపీ కార్యకర్తలే..*
*సీఎం జగన్ ప్రోద్బలంతోనే తమపై దాడికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు*
*రాజధాని ప్రాంతంలో తమ పర్యటనను అడ్డుకోవడం సరికాదన్నారు*
*మేం అధికారంలో ఉన్నప్పుడు ఇలా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవాలన్నారు*
*కానీ తాము అలా చేయలేదని, చేయబోమని చెప్పారు*
*అధికారం ఉందనే అండతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేయడం మంచి పద్ధతి కాదన్నారు*
*మంత్రి తీరు సరికాదు..*
*రాజధానిని ఓ మంత్రి శ్మశానంతో పోల్చడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు*
*సభ్యత, సంస్కారం ఉన్న మంత్రి అలా మాట్లాడుతారా అని ప్రశ్నించారు*
*శ్మశానంలో ఉండి పనిచేస్తున్నారా అని నిలదీశారు*
*అసెంబ్లీ, కౌన్సిల్ శ్మశానంలో ఉందా ? ఇక్కడినుంచే మీరు చట్టాలు చేస్తున్నారా అని ఫైరయ్యారు*
*న్యాయం చెప్పే హైకోర్టు ఎక్కడ ఉంది ? ఇక్కడే కదా అని గుర్తుచేశారు*
*దీని పై ఏమైనా మాట్లాడితే చాలు బూతు పురాణం వినిపిస్తున్నారని మండిపడ్డారు*