కిడ్నాపర్లను చాకచక్యంగా పట్టుకొన్న పెద్దపల్లి పోలీసులు.


నిందితులు 06 గురు అరెస్ట్, పరారీలో ఒకరు

రెండు వాహనాలు,06 సెల్ ఫోన్స్, 5, 98, 100 నగదు, 3 కత్తులు, 5 మంకీ క్యాప్స్, 2 ఇతర వాహనాల నెంబర్ ప్లేట్స్, స్వాధీనం

పెద్దపల్లి జిల్లా కేంద్రం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో నివాసం ఉంటున్న నల్లూరి సిద్ధయ్య (45) గౌరెడ్డిపేటలో ఇటుకబట్టీలు నిర్వహిస్తున్నాడు. గత నెల నవంబర్ 25 సోమవారు రోజు రాత్రి 10.30 గంటల సమయంలో ఇటుకబట్టీ వద్ద పనులు ముగించుకొని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా కిడ్నాప్ చేసి సిద్ధయ్య ఫోన్‌లో నుంచి కిడ్నాపర్లు ఆయన భార్యకు ఫోన్‌చేసి ఇంట్లో ఉన్న డబ్బంతా తీసి పెట్టాలని సూచించారు అని . ఇన్నోవా వాహనాన్ని పెద్దపల్లి నుంచి పరిసరాల ప్రాంతాలకు తిప్పుతూ పలుమార్లు ఆయన భార్యకు ఫోన్‌చేశారు అని . చివరకు అర్ధరాత్రి 1.30 గంటలకు సిద్ధయ్య ఇంటి కి వచ్చి ఆయన భార్య బయటికి వచ్చి డబ్బుల కవర్‌ ఇవ్వగానే సిద్దయ్య ని వదిలి వెళ్ళినారు . సిద్ధయ్యను కిడ్నాప్‌ చేసి ఆ సమయంలో అతడి జేబు లో ఉన్న రూ. 56 వేలు,బంగారు ఉంగరం ,ఎటిఎమ్ కార్డు లాక్కొని పిన్ నెంబర్ తీసుకోని వెళ్ళారని ఇచ్చిన పిర్యాదు మేరకు బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి విచారణ ప్రారంబించడం జరిగింది.

విచారణ నేపద్యం & కిడ్నాపర్లను పట్టుకొన్న విధానం నేరం చేసిన విధానం :

?విచారణలో అందులో భాగంగా పెద్దపల్లి డిసిపి పి.రవీందర్ మరియు ఏసీపీ హబీబ్ ఖాన్ గారు ఆధ్వర్యంలో 7 బృందాలుగా విడిపోయి విచారణ మొదలు పెట్టడం జరిగింది
?మొదటగా పెద్దపెల్లి బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని, కరీంనగర్ ,వరంగల్ ముఖ్య ప్రాంతంలో కొన్ని సీసీ కెమెరాలు క్షుణ్ణంగా పరిశీలించి చూడగా రెండు వాహనాలు అవి ఇన్నోవా. తవేరా వాహనాలు గా గుర్తించడం జరిగింది..

?కిడ్నాప్ సమయంలో నిందితుల్లో ఒకరు బాధితుడి నుండి ఎస్బిఐ ఏటీఎం కార్డును తీసుకొన్న సమయంలో ఏటీఎం పిన్ వివరాలు సిద్దయ్య వద్ద నుండి తెలుసుకోవడం జరిగింది. తరువాత బాధితుడు దాన్ని బ్లాక్ చేయకుండా ఉంచడం వలన నేరస్తులు ఆ ఏటీఎం కార్డు నుండి తొర్రూర్, సూర్యాపేట కోదాడ,హైదరాబాద్ లోని ఉప్పల్ ఎటిఎం సెంటర్లు మరియు పెట్రోల్ బంకులో కార్డు ఉపయోగించి నగదు తీసుకోవడం జరిగింది. వాళ్లు డ్రా చేసిన ప్రతిసారి సిద్దయ్యకి వచ్చిన బ్యాంకు లావాదేవిల మెసేజ్ ఆధారంగా మొదట సూర్యాపేట పోలీసుల సహాయంతో ఫోటోలు మరియు వాహన నెంబర్లు సేకరించడం జరిగింది.

?అదేవిధంగా సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఇద్దరు నిందితులు గోవాలో ఉన్నారని సమాచారం తెలియడంతో అక్కడికి కూడా పోలీస్ బృందం పంపించడం జరిగింది

?కిడ్నాప్ ఉదంతం లో ముఖ్య పాత్రధారి అయిన రజిని సిద్దయ్యను ఇంటిదగ్గర వదిలేసిన తరువాత వారు ఉపయోగించిన కత్తి మరియు డబ్బులు సంబంధించిన బ్యాగ్ తో తన తల్లి గారి ఇంటికి వెళ్లి పోలీసులకి అనుమానం వచ్చి దొరికిపోతామనే అనే భయంతో అక్కడే ఒకరోజు తన తల్లి వద్ద ఉండి మరుసటి రోజు అక్కడ నుండి వెళ్లి పోయింది .

?ఈ రోజు నిందితులు రజనీ వద్దకు వచ్చి ఆమె వద్దనున్న డబ్బులను వాటాలుగా పంచుకొనేందుకు పెద్దపల్లికి వచ్చారనే నమ్మదగిగిన పక్కా సమాచారం మేరకు రంగంపల్లి ఆర్టీఏ ఆఫీస్ ఎదురుగా ఉన్న రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖి చేస్తుండగా అటు వైపుగా వచ్చిన ఇన్నోవా, టవేరా వాహనాలను అపి తనిఖీ చేస్తుండగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం జరిగింది .

నేరం చేసిన విధానం

గుండ రజిని w/o మేకల సురేష్, వయస్సు 30 సంవత్సరాలు, కులం :మాల, నివాసం: గౌరెడ్డిపేట రోడ్ మార్గంలోని ఫైర్ స్టేషన్ ముందు పెద్దపల్లి మరియు గడ్డం ప్రవీణ్ కుమార్ లు అప్పులపాలై అప్పులను తీర్చడానికి ఎలాగైనా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తన మామ అయిన వేల్పుల తిరుపతి బట్టి యజమాని నల్లూరి సిద్దయ్య వద్ద గుమస్తాగా గత పది సంవత్సరాల పని చేయుచున్నాడు. మా మామ అయిన తిరుపతి ,బట్టి యజమాని కి సంబందించిన సిద్దయ్య డబ్బులు లక్షల రూపాయులు ఇంటికి తెచ్చే వాడని ,ఒరిస్సా రాష్ట్రం నుంచి బట్టిలో పనిచేసేందుకు కార్మికులను తీసుకువచ్చేందుకు నగదు లక్షల్లో తీసుకొని పోయేవారు. వేల్పుల తిరుపతి చాలా సందర్భాల్లో ఇంట్లో వారితో సిద్దయ్య దగ్గర కొట్ల రూపాయల్లో డబ్బులు ఉంటాయి అని చెప్పేవాడు . రజిని దురుద్దేశంతో ప్రవీణ్ కు సిద్దయ్య దగ్గర కోట్ల రూపాయల్లో డబ్బులు ఉంటాయని ,అతడిని కిడ్నాప్ చేసి చంపుతామని బెదిరించినచో సిద్దయ్య లక్షలు రూపాయల డబ్బులు ఇస్తాడని దాంతో మన అప్పులన్నీ తీరిపోవాడంతో పాటు జల్సాగా బతకవచ్చని ప్రవీణ్ తో చెప్పడం జరిగింది. ఈ మాట విన్న ప్రవీణ్ చాలా మంచి ఆలోచన అలాగే చేద్దాం నా స్నేహితుల్లో కొందరిని తీసుకొని వస్తానని చెప్పినాడు. వీరు వేసుకున్న పథకం ప్రకారం తేదీ 19. 11. 2019 రోజున మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక వాహనం తీసుకొని రాగా అతనితో పాటు అతని తమ్ముడు రమేష్ ఇంకా ఇద్దరు రాగ వారిని డ్రైవర్ కిరీటి మరియు మున్నా గా పరిచయం చేయడం జరిగింది. వారందరూ టవేరా వాహనములో సాయంత్రం 6 గంటలకు కరీంనగర్ కు వచ్చి బైపాస్ లో ఉన్న లోఉన్న ఒక బార్లో ప్రవీణ్, రమేష్ తో పాటు మిగతా వారు మద్యం తాగి అక్కడి నుండి బయలుదేరి పెద్దపెల్లికి రాత్రి సుమారు తొమ్మిది గంటలకు చేరుకున్నారు. రజనీకి తో పాటు శాంతినగర్ పెద్దపల్లి లో సిద్దయ్య ఇంటి వద్దకు వెళ్ళగా ఆ సమయంలో కాలనీ వాసులు రోడ్ పై ఉండడంతో అప్పుడు సిద్దయ్య ను కిడ్నాప్ చేస్తే దొరికిపోతావు అని భయపడి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అక్కడ నుండి తిరిగి వెళుతూ నిత్య రెడ్డి రెస్టారెంట్లో బిర్యాని తిని కాజిపేట్ వెళ్లిపోయినారు.
ఇంటిదగ్గర కిడ్నాప్ చేస్తే దొరికి పోతామని, ఇటుక బట్టీల నుండి వ బండి మీద గౌరీ రెడ్డి పేట నుండి బయలుదేరి రాఘవపురం రోడ్డు మీదుగా శాంతినగర్ ఇంటికి వెళ్తాడని అప్పుడు కిడ్నాప్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకొన్నారు , సిద్దయ్య ఇటుక బట్టీలు వివరాలు తెలుసుకొని తేదీ 25.11.2019 రోజున అంతకుముందు తీసుకువచ్చిన తవేరా మరియు ఇన్నోవా వాహనం లో రజిని, ప్రవీణ్ అతని తమ్ముడు రమేష్, కిరీటి, మున్నా డ్రైవర్ షేక్ బాషా, షకీల్ లు రెండు వాహనాల్లో బయల్దేరి మార్గమధ్యలో కిడ్నాప్ సమయంలో ముఖాలు కనపడకుండా ఉండటానికి మాస్క్లు కొనడం జరిగింది. తర్వాత సాయంత్రం 7 గంటల వరకు కరీంనగర్ కి వచ్చి, పెద్దపల్లి నుండి కరీంనగర్ టౌన్ లోకి పోయే దారిలో రోడ్డు పక్కన డేరాలు వేసుకొని కత్తులు తయారు చేసే వారి వద్ద నుండి రెండు కత్తులు తీసుకోవడం జరిగింది. బైపాస్ పెద్ద పల్లి చౌరస్తాలో గల బార్లు మద్యం తాగి రాత్రి 8 గంటల సమయంలో కరీంనగర్ నుండి బయలుదేరి పెద్దపల్లి కి వచ్చి రెండు కత్తులు సరిపోవని పెద్దపల్లి లోని జెండా ప్రాంతానికి వెళ్లి ఒక షాపులో మరో ఒక కత్తిని కొన్నారు. రైల్వే స్టేషన్ రోడ్డులో గల రజిని ఇంటికి పోయే రోడ్డు వద్ద తనను దింపి దింపి మిగతావారు సిద్దయ్య ఇంటి ప్రాంతంలో రెక్కీ నిర్వహించి అతని ఇంటి వద్ద లేడని నిర్ణయించుకొని హనుమాన్ గుడి వద్ద కి వచ్చి రజిని వాహనంలో ఎక్కించుకుని ఇటుక బట్టీల వద్దకు వెళ్ళినారు. వెళ్లే సమయంలో సిద్దయ్య రజిని గుర్తు పడతారని ఉద్దేశంతో రజిని రమేష్ మరియు మున్నా, కిరీటి లు తవేరా వాహనంలో, మిగతావారు ఇన్నోవా వాహనంలో బయలుదేరి ఇటుక బట్టీల వద్దకు వెళ్ళినారు. ప్రవీణ్ రాత్రి అందాజ 10:30 గంటల సమయంలో సైన్ బండి మీద వస్తూ ఉన్న సిద్దయ్య ను కిడ్నాప్ చేసి మిగతా వారు ఇన్నావా వాహనంలో ఎక్కించుకుని అప్పన పేట పెట్రోల్ బంక్ వద్ద ఆపి ప్రవీణ్ రజనీకి ఫోన్ చేసి మాట్లాడగా ,రజిని సిద్దయ్య ఇంటికి ఫోన్ చేయించి లేట్ అవుతుంది. తర్వాత అతను అవసరానికి డబ్బులు తయారు చేయమని బెదిరించారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రవీణ్ సిద్దయ్యను బెదిరించారు తర్వాత అక్కడి నుండి బసంత్ నగర్ వైపు వెళ్లడం జరిగింది. టోల్ గేట్ వద్ద కి వెళ్తే దొరికిపోతావు అని తిరిగి వచ్చి మళ్ళీ అప్పన్నపేట ఫ్లై ఓవర్ వద్ద కారు ఆపి మరల ప్రవీణ్ రజని కి ఫోన్ చేసి కత్తులతో బెదిరించి నా డబ్బులు లేవు అంటున్నాడు ఇలా అని అడగగా రజిని ప్రవీణ్ తో ఎంత ఇస్తే అంత తీసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత మరల వారు ఫ్లైఓవర్ నుండి మంథని వైపు పోతూ కొంతదూరం తర్వాత తిరిగి శాంతినగర్ రావడం జరిగింది. వీరి ని ఫాలో అవుతూ తవేరా వాహనంలో ఉన్న రజిని కూడా అక్కడికి రావడం జరిగింది. సిద్దయ్య ఇంటికి సుమారు ఒకటిన్నర గంటలకు ఇంటికి వెళ్లి ఆయన భార్య బయటికి వచ్చి 8 లక్షల డబ్బుల కవర్‌ ఇవ్వడం జరిగింది . సిద్దయ్య జేబు లో ఉన్న రూ. 56 వేల నగదు ,బంగారు ఉంగరం ,సిద్దయ్య,అతని బార్య సంబందించిన ఎటిఎమ్ కార్డు తీసుకొని పిన్ వివరములు తెలుసుకొన్నారు. అనంతరం రైల్వే స్టేషన్ రోడ్ లో గల గుడి వద్దకు వచ్చి అందరు కలుసుకోవడం జరిగింది.ప్రవీణ్,కిరీటి,షకీల్ కొంత డబ్బు తీసుకోని వెళ్ళగా మిగత నగదు రజిని వద్ద ఉంచి తర్వాత పంచుకుందామని నిర్నహించుకొని వెళ్లినారు .

వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న వాటి వివరములు:

గుండ రజిని వద్దనుండి

సెల్ఫోన్, రెండు లక్షల రూపాయల నగదు
గడ్డం ప్రవీణ్ కుమార్ వద్దనుండి

సెల్ఫోన్, లక్షా 50 వేల రూపాయల నగదు మూడు కత్తులు, 5 మంకీ క్యాప్స్

మున్నా వద్దనుండి
సెల్ఫోన్, 30 వేల నగదు

గడ్డం కిరీటి వద్ద నుంచి
సెల్ ఫోన్, ఒక లక్ష 30 వేల రూపాయల నగదు, రెండు ఎటిఎం కార్డ్స్,

గడ్డం రమేష్ వద్ద నుంచి
సెల్ఫోన్, 50 వేల రూపాయల నగదు
షేక్ బాషా వద్ద నుంచి
సెల్ ఫోన్, 38 వేల ఒక వంద రూపాయల నగదు
పరారీలో ఉన్న నిందితుడు

షకీల్,హన్మకొండ

చేసిన అప్పులు మరియు జల్సాల కోసం కిడ్నాప్

ఈజీ ఎర్నింగ్‌ మనీకి అలవాటు పడుతున్నారు. విలాసాలకు, జల్సాలకు, చెడు తిరుగుళ్లకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. చివరకు పోలీసులకు చిక్కి శ్రీకృష్ణ జన్మస్థానంలో ఊచలు లెక్క బెడుతున్నారు.అప్పులు తీర్చలేక, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక రకరకాల నేరాలకు పాల్పడు తున్నారు. నేరాలు చేసే సమయంలో ఒక్కొక్కసారి ఎదురొచ్చిన వారిని చంపడానికైనా వెనుకాడడం లేదు. డబ్బు కోసం అలవాటు పడి రకరకాల నేరాలకు పాల్పడి జీవితం నాశనం చేసుకుంటున్నారు

ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు …మార్పు రాకపోతే కఠినంగా వ్యవహరిస్తాం….

నేరాలకు పాల్పడే వ్యక్తులు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోకుండా తిరిగి నేరాలకు పాల్పడిది చట్టపరమైన చర్యలు కఠినం గా ఉంటాయని చెడు ప్రవర్తన కలిగినవారు వారి అలవాట్లను మార్చుకోవాలని లేని పక్షంలో ఎంతటి వారైన ఉపేక్షించేది లేదని సిపి గారు హెచ్చరించారు. రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిదిలో వివిధ రకాల నేరాలకు పాల్పడిన (33) మందిపై ఇప్పటి వరకు పిడి యాక్ట్ అమలు చేయడం జరిగింది .
ఈ సమావేశం లో పెద్దపల్లి డీసీపీ పి.రవీందర్, ఏసిపి హబీబ్ ఖాన్, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, సుల్తానాబాద్ సీఐ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ బాబు రావు, ఎస్ ఐ పెద్దపల్లి upendar, బసంత్ నగర్ ఎస్ ఐ జానీ పాషా, ధర్మారం ఎస్ఐ ప్రేం, జూలపల్లి ఎస్ ఐ లక్ష్మణ్, సుల్తానాబాద్ ఎస్ ఐ రాజేష్, కాల్వశ్రీరాంపూర్ ఎస్ ఐ ప్రగతి పాల్గొన్నారు.

About The Author