అత్యాచారాలు ఆపడానికి చట్టానికి పదును పెట్టాలి. డివైయఫ్ఐ మరియు ఐద్వా డిమాండ్:

 

తిరుపతి:తిరుచానూరు, డాక్టర్ దిశ,మానస,టేకుల అత్యాచారం,హత్యలను నిరసిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ  డివైయఫ్ఐ,ఐద్వా ఆద్వర్యంలో ప్రభుత్వ మరియు,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో కలసి తిరుచానూరు పంచాయతీ కార్యాలయం నుండి సింథూ కూడలి వరకు ర్యాలి నిర్వహించారు.అనంతరం నిందుతుల దిష్టి బొమ్మలను తగలబెట్టారు.ఈ సందర్భంగా డివైయఫ్ఐ  మరియు ఐద్వా ఆద్వర్యంలో మరియు డివైయఫ్ఐ నగర కార్యదర్శి మాజీ యమ్.పి.టి.సి సుమన్ అధ్యక్షతన సుమారు మూడు వేల మంది విద్యార్థులు కేంద్రప్రభుత్వం మరియు న్యాయస్థానాలను కోరుతూ నిందితులను కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.

అనంతరంఅత్యాచార,హత్యా నిందితులు  ఫోటోలతో కూడిన దిష్టి బొమ్మలను ర్యాలిగా తీసుకుని వెల్లి సింధూ కూడలి వద్ద దగ్థం చేశారు.

About The Author