దిశ నిందితుల అంత్యక్రియలపై హైకోర్టు కీలక ఆదేశాలు…


దిశ నిందితుల అంత్యక్రియలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 9వరకు మృతదేహాలను భద్రపరచాలని హైకోర్టు ఆదేశించింది. దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టుకు మహిళా సంఘాలు లేఖలు రాశాయి. దీనిపై విచారించిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కస్టడీలో ఉన్న నిందితులను ఎలా ఎన్‌కౌంటర్ చేస్తారు..? కోర్ట్‌లో కేసు నడుస్తున్న సమయంలో చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు..? అని ఆ లేఖలో మహిళా సంఘాలు ప్రశ్నించాయి. ఎన్‌కౌంటర్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డిజీపీకి ఆదేశాలు ఇవ్వాలని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. నలుగురు మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేసి వీడియో తీయాలని అందులో వెల్లడించారు.అయితే చీఫ్ జస్టిస్ అందుబాటులో లేకపోవడంతో దీనిపై సోమవారం విచారిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ క్రమంలోనే దీంతో ఈ నెల 9వ తేదీ వరకు వారి మృతదేహాలు మహబూబ్‌ నగర్ ప్రభుత్వాసుపత్రిలోనే ఉంచనున్నారు. కాగా శనివారం ఎన్‌హెచ్‌ఆర్సీ ప్రతినిధులు మహబూబ్‌నగర్ ఆసుపత్రి వెళ్లి.. మృతదేహాలను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ ప్రభుత్వాసుపత్రి దగ్గర భారీగా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.

About The Author