తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి కష్టాలు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి కోసం తిప్పలు తప్పడం లేదు. రోజు రోజుకూ పెరిగిపోతున్న ధరలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం అందించే రాయితీ ఉల్లి కోసం ఎగబడుతున్నారు. ఒంగోలు రైతు బజారులో రాయితీ ఉల్లి కోసం వినియోగదారులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్నారు. ఆదివారం సెలవురోజు కావడంతో  మరింత రద్దీ అధికమైందని స్థానికులు చెబుతున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు ఉండటంతో తమకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని వృద్ధులు, మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు. ఉల్లి కోసం కడపలో రైతు బజారు వద్ద ప్రజలు బారులు తీరారు. వృద్ధులు, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ పడిగాపులు కాశారు. గ్రామవాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఉల్లి సరఫరా చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

About The Author