ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం …


దాదాపు పది పని రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం …

20 ప్రధానాంశాలపై సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దం.

3 నుంచి 5 బిల్లులు ప్రవేశపెట్టే ఆలోచన ..

సోమవారం తొలిరోజున ‘దిశ’ హత్యోదంతంపై చర్చ…

. కీలకమైన బిల్లులు సభలో ప్రవేశ పెట్టనున్నారు..

అధికార ప్రతిపక్ష పార్టీ లు అసెంబ్లీ సమావేశాలకు సిద్ధం అయ్యాయి..

మొదటి రోజు సభ ప్రారంభం అయ్యాక క్వశ్చన్ అవర్ ముగిసాకా బీఏసీ సమావేశం జరుగుతుంది..

ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నిరోజులు జరగాలి అనేది చర్చిస్తారు..

నామినేటెడ్‌ పదవులు, ప్రభుత్వ పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ… ప్రభుత్వం చేసిన చట్టంపై మరోసారి సభలో చర్చ జరుగుతుంది.

సుమారు 20 అంశాలపై సభలో చర్చించ డాని కి ప్రభుత్వం రెడి అవుతోంది..

పాఠశాల విద్యలో ఆంగ్లమాధ్యమాన్ని ప్రవేశపెట్టడం.. ప్రభుత్వ, ప్రైవేటుపాఠశాలలన్నింటిలోనూ తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేయడం వంటి 20అంశాలపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ వైఫల్యాలపై సభలో గట్టిగా నిలదీసేందుకు ప్రతిపక్ష తెదేపా కూడా వ్యూహాలను సిద్ధం చేసుకుంది.

21 అంశాలు సభలో ప్రస్తావించాలని టీడీపీ నిర్ణయించింది…

రాజధాని అమరావతి. ఇసుక ఇంగ్లీష్ మీడియం తో పాటు రాష్ట్రం లో శాంతి భద్రతల అంశాన్ని టీడీపీ ప్రస్తావిస్తూ చర్చ జరగాలని సూచిస్తుంది…

ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా కూడా హీట్ పుట్టించనున్నాయి.

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీ కి దూరంగా ఉన్నారు…మరి కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు కూడా పార్టీ మరే ఆలోచన లో ఉన్నారు.

.మరో వైపు వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు లో మాఫియా పెరిగింది అని సంచలన వ్యాఖ్యలు చేయడం సీఎం జగన్ సీరియస్ అవ్వడం జరిగిపోయాయి..

దీంతో అసెంబ్లీ లో వీరి వైఖరి ఎలా ఉంటుంది అని చర్చ జరుగుతోంది..

మొత్తానికి ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వేడి పుట్టించేలా ఉన్నాయి…

About The Author