బడా బాబుకు చట్టాన్ని చుట్టంగా మార్చిన తెలంగాణ పోలీసులు.?
బయోడైవర్సీటీ ఫ్లైఓవర్పై అతి వేగంతో వెళ్తూ.. కారు ప్రమాదం చేసిన కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు.. పోలీసులు ఉదారతతో అరెస్టు నుంచి తప్పించుకున్నారు.
ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని.. ఆయన డిశ్చార్జ్ కాగానే అరెస్ట్ చేస్తామంటూ.. పోలీసులు .. యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచి చెబుతూనే ఉన్నారు. కానీ.., అత్యాధునిక కారులో… అంతకంటే ఆత్యాధునికమైన భద్రతా ఏర్పాట్లు ఉండటంతో.. కృష్ణమిలన్ రావుకు.. చాలా స్వల్ప గాయాలే అయ్యాయి. ఆ కారు మీద పడటంతో.. ఓ మహిళ ఛిద్రమై మరణించింది. మరికొంత మంది తీవ్ర గాయాలపాలై.. వికలాంగులుగా మారే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడా కృష్ణమిలన్ రావు..డిశ్చార్జ్ అయిపోయి ఇంటికెళ్లిపోయారు.
బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ పై… నలభై కిలోమీటర్ల వేగానికి మాత్రమే అనుమతి ఉంది. కానీ కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు .. దాదాపుగా 105 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించారు. మలుపు తిప్పుకోలేక… ప్రమాదానికి గురి చేశారు. ఈ విషయంలో పోలీసులు తీవ్రమైన కేసులు పెట్టాల్సింది, కానీ.. బెయిలబుల్ సెక్షన్లు అయిన 304(ఏ ) కింద కేసు నమోదు చేశారు. ఇది కేవలం.. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యం కింద వచ్చే సెక్షన్. ఆ తర్వాత విమర్శలు రావడంతో.. 304 సెక్షన్ కూడా చేర్చారు. అది కూడా.. బెయిలబులే.
ఈ అంశాలను ఆధారం చేసుకుని కృష్ణమిలన్ రావు.. అరెస్ట్ చేయకుండా కోర్టుకు వెళ్లారు.కోర్టు .. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ను పరిశీలించి.. కృష్ణమిలన్ రావు పిటిషన్ను విచారించి.. పన్నెండో తేదీ వరకూ..అరెస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు వచ్చేంత వరకూ.. ఆస్పత్రిలో చికిత్స పొందిన కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు… ఆ ఆదేశాలు చేతికి అంతగానే.. డిశ్చార్జ్ అయి ఇంటికెళ్లిపోయారు.
అప్పటి వరకూ ఐసీయూలో చికిత్స పొందుతున్నందున అరెస్ట్ చేయలేమంటూ..మాటలు చెప్పిన పోలీసులు తర్వాత కోర్టు ఆర్డర్స్ చూపి.. చూస్తూండిపోయారు. ఇప్పుడు.. తదుపరి విచారణ పన్నెండో తేదీన జరగనుంది.
పోలీసులు పెద్దల విషయంలో.. చట్టాన్ని ఎలా చుట్టంగా మార్చేస్తారో.. ఈ వ్యవహారం తేలిపోతోందన్న విమర్శలు బలంగానే వినిపిస్తున్నాయి. కేవలం.. కల్వకుంట్ల కృష్ణమిలన్ రావు… తప్పిదం.. వల్ల.. నిబంధనలు అతిక్రమించిన డ్రైవింగ్ వల్ల.. కొన్ని కుటుంబాలు.. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. భార్యను కోల్పోయిన భర్త.. తల్లిని కోల్పోయిన పిల్లలు