సిటిజన్ షిప్ సవరణ బిల్లు రాజ్యసభ గడప దాటినా…..


బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిటిజన్ షిప్ సవరణ బిల్లును మెజార్టీ ఉండడంతో లోక్సభ గడప దాటించారు. అయితే ఈ బిల్లు ఇవాళ పెద్దలసభ రాజ్యసభ ముందుకు రానుంది. పెద్దల సభలో బిల్లు పాస్ కావడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ ఎంపీలంతా కచ్చితంగా సభకు హాజరు కావాలని విప్
జారీ చేసింది. రాజ్యసభలో మొత్తం సీట్లు 245 కాగా.. ప్రస్తుతం ఐదు ఖాళీలు ఉన్నాయి.
రాజ్యసభలో అధికార NDA కూటమికి 117 మంది ఎంపీల బలముంది. ఇందులో బీజేపీకి 83, అన్నాడీఎంకే 11, జేడీయూ 6కు 6గురు
ఎంపీలున్నారు. ప్రతిపక్ష యూపీఏ కూటమికి 67 మంది ఎంపీలున్నారు కాంగ్రెస్ కు 46, డీఎంకేకు 5, ఆర్జేడీకి 4, ఎన్సీపీకి ముగ్గురు ఎంపీలున్నారు. తటస్టంగా 61 మంది ఎంపీలున్నారు. ఇందులో
టీఎంసీకి 13, ఎస్పీకి తొమ్మిది, బీజేడీకి ఏడుగురు , టీఆర్ఎస్ కు ఆరుగురు , బీఎస్పికి నలుగురు, టీడీపీ కి రెండు , వైసీపీకి రెండు ఎంపీలు సీట్లున్నాయి. వామపక్షాలకు రాజ్యసభలో ఆరుగురు
ఎంపీలున్నారు. అయితే తటస్థ గ్రూపులో ఉన్న కొన్ని పార్టీ లోక్ సభలో బిల్లుకు మద్దతు ఇచ్చాయి. ఇటీవలే బీజేపీ కటీష్ చేసిన శివసేన, వైసీపీ
ఎంపీలు బిల్లు కు మద్దతుగా ఓటేశారు. ఈ రెండు పార్టీలకు రాజ్యసభలో ఐదుగురు ఎంపీలున్నారు. వారు మద్దతు ఇస్తే రాజ్యసభలోనూ పౌరసత్వ చట్ట సవరణ బిల్లు ఈజీగానే గట్టెక్కుతుంది. వ్యూహాత్మతంగా వ్యవహరిస్తున్న బీజేపీ.. కొన్ని పార్టి లను ఓటింగ్ దూరంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బిల్లు అడ్డుకుంటామంటున్న
విపక్ష పార్టీలు ప్రత్యేక ప్యూహాలు రచిస్తున్నాయి.

About The Author